ఇప్పటివరకూ ఎంతోమంది లోకల్ బ్యూటీషియన్స్ నుండి టిప్స్ తెలుసుకుంటూ వచ్చాం.. అయితే తాజాగా కొరియా అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ పైన రిసేర్చ్ చేస్తే కొన్ని ఆశక్తికరమైన విషయాలను వెలుగులోకి వచ్చాయి, ఇంతకీ అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
కొరియావాళ్లను ఎప్పుడైనా జాగ్రత్తగా చూశారా ? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. వాళ్ల ముఖంలో ఒకరకమైన మెరుపు ఉంటుంది.
అందుకే కొరియా సీరియల్ స్టార్స్, పాప్ స్టార్స్, మోడల్స్ ను మన దేశం వాళ్లు కూడా విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఈ రోజు వాళ్లు అంత అందంగా కనిపించడం వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం.
కంటినిండా మంచి నిద్: దీని వల్ల శరీరానికి సరికొత్త శక్తి లభించడమే కాదు, అందం కూడా పెరుగుతుంది. ఇది కొరియా వాసులకు బాగా తెలుసు.. అందుకే వాళ్లు నిద్ర విషయంలో కాంప్రమైజ్ కారు.
ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మంచి నీళ్లతో ముఖం శుభ్రపరుచుకోవాలి. కేవలం నీటితో మాత్రమే కడగాలి.. క్లెన్సర్లు వాడకూడదు.
ఫేస్ వాష్ తరువాత టోనర్ వినియోగించాలి. దీని కోసం కాటన్ ను లేదా మీ అరచేతులను వినియోగించాలి. ఇది మీ స్కిన్ లో ఉన్న పీహెచ్ స్థాయిలను రక్షిస్తుంది. దాంతో పాటు ఎస్సెన్స్ సీరమ్ ను వాడాలి. ఇందులో టోనర్, మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. దీన్ని అరచేతితో అప్లై చేయాలి.. వేళ్లు వాడకూడదు..
మన చర్మానికి తగిన సీరంను ఎంచుకోవాలి. దీని వల్ల చర్మంపై ఉండే ముడతలు, డార్క్ సర్కిల్స్ , డ్రైన్ స్కిన్ వంటి సమస్యలు తొలగిపోతాయి.
కంటి కింద భాగంలో మెరుపు కోసం ముఖానికి వాడే ఫేస్ క్రీమ్ లను కాకుండా "ఐ క్రీమ్" వాడాలి. దీన్ని వేలి చివరన తీసుకుని కంటి మొదలు నుంచి చివరి వరకు అప్లై చేయాలి. కంటికి టచ్ కాకుండా చూసుకోవాలి.
మీ చర్మం ఎలాంటిదో తెలుసుకొని మాయిశ్చరైజర్ ను ఎంచుకోవాలి. ఎందుకంటే చర్మం కాంతి వంతం అవ్వడంలో మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది.
చివరిగా సన్ స్రీన్ లోషన్ ను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది యూవీ రేయ్స్ ట్యాన్ నుంచి, ముడతల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
ఈ చిట్కాలు మీకు కాస్త కష్టంగా అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి.. అందం ఊరికే రాదు. అందంగా ఉండాలి అనుకుంటే ఈ మాత్రం కష్టపడాలి మరి..
ఇక ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవడానికి మన దేశ సాంప్రదాయ చిట్కాలు ఒకసారి చూస్తే:
వైరస్ వల్ల పరిస్థితులు మారాయి. దీని ప్రభావం అతివలు తరచూ వాడే సౌందర్య సాధనాల పై కూడా పడింది. అంతకు ముందు ఉన్నట్టు ఉత్పత్తులు అందుబాటులో ఉండటం లేవు. కొన్ని అందుబాటులో ఉన్నా వాటికోసం బయటికి వెళ్లడానికి చాలా మంది సంకోచిస్తున్నారు. అలాంటి వారి కోసం ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునే చిట్కాలు గమనిస్తే:
తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. రోజుకు రెండుసార్లు ముఖంపై అప్లై చేయాలి. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
నిగనిగలాడే చర్మం కోసం నిమ్మకాయను కూడా వాడవచ్చు. నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాల వల్ల ముఖంపై పేరుకుపోయిన మలినాలు తొలగుతాయి. దీని కోసం తరచూ నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేయాలి.
ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలిగిపోవాలి అనుకుంటే కీరదోస ముక్కను తీసుకుని ముఖంపై మెల్లిగా రుద్దాలి. కొన్ని నిమిషాల తరువాత కీరదోసను తొలగించాలి.
కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్‌ను తొలగించాలి అనుకుంటే కీరదోస ముక్కల్ని మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం ఉంటుంది.
ముఖం మెరిసిపోవాలి అంటే తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేయాలి. తరువాత నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారంలో ఫలితం కనిస్తుంది.
సో, స్త్రీలు ఈ లాక్ డౌన్ టైం లో అనుసరించాల్సిన కొన్ని సౌందర్య చిట్కాలు తెలుసుకున్నారు కదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments