అనారోగ్యాల‌ను దూరం చేసే.... బొడ్డుతాడు ఎలా భ‌ద్ర‌ప‌రుస్తారు?

img

అనారోగ్యాల‌ను దూరం చేసే.... బొడ్డుతాడు

ఎలా భ‌ద్ర‌ప‌రుస్తారు?

ఏ ప్ర‌క్రియ ద్వారా వినియోగిస్తారు?

జన్మతః ఉండే బొడ్డుతాడును భద్రపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఏ రకమైన వ్యాధినైనా క్షణాల్లో నయం చేసే అవకాశం ఉంటుందని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. దీనికి సంబంధించిన అవగాహన కూడా పెరగడం వల్ల మూలకణం నిబిడీకృతమై ఉన్న బొడ్డుతాడును భద్రపరుచుకోవాలన్న ఆలోచన చాలామందిలో కలుగుతోంది. ఇప్పుడు బొడ్డుతాడు, దానిని భ‌ద్ర‌త‌ప‌రుచుకోవ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుందాం....

ఇటీవలి కాలంలో బొడ్డుతాడును సంరక్షించుకునే ప్రక్రియ ప్రాచుర్యంపొందింది. దీనినుంచి మూలకణాలను సేకరించడంద్వారా ఆయా శిశువుల భవిష్యత్తు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే అవకాశాలను వైద్య‌నిపుణులు బలోపేతం చేస్తున్నారు. బొడ్డుతాడులో ప్రధానంగా రెండు రకాల కణాలుంటాయి. వాటిలో ఒకటి హెమాటో పొయటిక్ కణాలు కాగా, రెండోవి మెసెంచిమల్ కణాలు. ఈ రెండు రకాల కణాలు కూడా అనేక రకాలుగా శక్తివంతమైనవి. ఇవి తమ జీవితకాలంలో భిన్న కణాలుగా రూపాంతరం చెందే లక్షణాన్ని కలిగివుంటాయి. హెచ్‌ఎస్‌సిగా పేర్కొనే హెమాటో పొయటిక్ మూలకణాలు విచ్ఛిన్నమై భిన్న రక్తకణాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. వీటినుంచే మూడు ప్రధాన రకాలుగా కణాలు ఏర్పడతాయి. ఇవి శరీరంపై అనేక రకాల ప్రభావాన్ని చూపిస్తాయి. మొదటిది ఎర్ర రక్తకణాలు. ఇవి అత్యంత సహజమైన రక్తకణం. ఎర్ర రక్తకణాల వల్ల ప్రాణవాయువు శరీరంలోని భిన్న అవయవాలకు శ్వాసకోశ వ్యవస్థ ద్వారా అందుతుంది. ఇక రెండోది తెల్ల రక్తకణాలు. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంటే ఏ వ్యాధి సోకకుండా శరీరం శక్తివంతం కావడానికి ఈ తెల్ల రక్తకణాలు అధికంగా ఉండటమన్నది చాలా అవసరం. మూడోది ప్లేట్‌లెట్స్. వీటివల్ల రక్తస్రావం జరగకుండా అరికట్టడం సాధ్యమవుతుంది. వీటితోపాటు మెసెంచిమల్ మూలకణాలు ఎక్కువగా ఎముకల మూలుగలో లభిస్తాయి. ఈ కణాలు బొడ్డుతాడులో అధికంగా ఉంటాయన్న విషయాన్ని తాజా పరిశోధనల్లో శాస్తవ్రేత్తలు గుర్తించారు.

వీటిని శరీరంలో ప్రవేశపెడితే వాటినుంచి ఎముకల కణాలు, కొవ్వు కణాలు ఉత్పన్నమవుతాయి. ఎముకల కణాల ద్వారా ఎముకల పటుత్వం పెరుగుతుంది. ఎముకలు అరిగిపోవడం, దెబ్బతినడం, చిట్లిపోవడం వంటి వాటిని తగ్గించడానికి, నిరోధించడానికి ఈ కణాలు తోడ్పడతాయి. ఎముకల కణాల మాదిరిగా కార్టిలెజ్ కణాలు కూడా అరుగుదలను అరికడతాయి. ఇక కొవ్వును పెంచే యాండీపో సైటెస్ అనే కణాలు కొవ్వు రూపంలో శరీరంలో శక్తిని నిల్వ వుంచుతాయి. అవసరమైనప్పుడు శరీరం ఈ శక్తిని వినియోగించుకుంటుంది. మెసెంచ్‌మల్ కణాలకు సంబంధించి జరుగుతున్న అధ్యయనం ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. వాస్తవంగా ఇది బొడ్డుతాడులోనే ఎక్కువగా లభిస్తాయి. ఈనేప‌ధ్యంలోనే దేశవ్యాప్తంగా అనేక స్టెమ్‌సెల్ బ్యాంక్‌లు బొడ్డుతాడును పరిరక్షించే ప్రక్రియను చేపట్టాయి. వీటిద్వారా రోగులకు భిన్న స్థాయిలో మూలకణాలను అందించే ప్రక్రియను బలోపేతం చేశారు. శిశు జననం తర్వాత వైద్య బృందం బొడ్డుతాడును తొలగిస్తుంది. వీటిని ప్రత్యేకంగా భద్రపరుస్తారు. కార్డ్‌బ్లడ్ సంరక్షణే కాకుండా ఇటీవలి కాలంలో కార్డ్ టిష్యూ బ్యాంకింగ్ కూడా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. బొడ్డుతాడుతో పాటే దీన్నీ పరిరక్షిస్తున్నారు. కార్డ్‌టిష్యూ బ్యాంకింగ్ వల్ల వెన్నెముకకు సంబంధించిన వ్యాధులను సునాయాసంగా నయం చేసే అవకాశం ఉంటుంది.

బొడ్డుతాడు నుంచి మూలకణాలు తీయడంపై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో విస్తృత పరిశోధనలు జరగలేదు. అయితే బయటికొచ్చిన ఆధారాలు, విశ్లేష‌ణలన్నీ సానుకూలంగానే ఉన్నప్పటికీ కార్డ్‌బ్లడ్ మూలకణాలను భద్రపరిచే విషయంలో ఇంకా ఎంతో పరిశోధనలు జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో మూలకణాలు, కార్డ్‌బ్లడ్ బ్యాంకింగ్ అన్నది ఇటీవలి కాలంలో విస్తృత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కార్డ్‌బ్లడ్ బ్యాంకింగ్ అంటే ఒక శిశువు బొడ్డుతాడును సురక్షితంగా భద్రపరచడమే. ఇప్పటికే లక్షలాదిగా ఈ రకమైన సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే తల్లి కాబోతున్నవారు వీటి ఆవశ్యకతను ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. అత్యంత కీలకమైన ఈ మూలకణాలను భద్రపరిచేందుకు ఒకేసారి అవకాశం ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఒక్కసారి వీటిని భద్రపరచగలిగితే ఆ శిశువు అమృతం తాగినట్టే.

బొడ్డుతాడును పరిరక్షించుకునేందుకు ఓ స్పష్టమైన వైద్య ప్రక్రియ ఉంది. ఓ పద్ధతి ప్రకారం దీని సంరక్షణ చర్యలను ఆసుపత్రులు చేపడతాయి. శిశు జననం వెంటనే బొడ్డుతాడును కత్తిరిస్తారు. అది సహజంగా జరిగేదే. ఈ ప్రక్రియ ప్రకారం ఆ బొడ్డుతాడును మరొక గదిలోకి తీసుకెళ్లి అందులోని రక్తాన్ని బయటకు తీస్తారు. దాన్ని ఓ సురక్షితమైన పాత్రలో భద్రపరుస్తారు. ఇందుకు సంబంధించి అత్యంత మౌలికమైన పద్ధతులివి. ముందుగా ఈ బొడ్డుతాడును అన్నివిధాలుగా నియంత్రిత ఉష్ణోగ్రత కలిగిన కంటైనర్‌లో ఉంచుతారు. ఇందుకు సంబంధించిన విభాగమే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ రక్తాన్ని ఉంచిన పాత్రను ఓ ప్రైవేట్ వాహనంలో స్టోరేజీ కేంద్రానికి తరలిస్తారు. ఈ రక్తం నుంచి మూలకణాలను సంబంధిత సిబ్బంది వేరుచేస్తారు. అనంతరం ఈ కణాలను దీర్ఘకాల క్రయోజనిక్ సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ మూలకణాలను వైద్య చికిత్స నిమిత్తం ఉపయోగించుకునే వీలుంటుంది.

 

భారతదేశంలో మూలకణ చికిత్సా విధానం మొదలైనప్పటినుంచి బొడ్డుతాడు పరిరక్షణ విషయంలో అవగాహన పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వపరంగా ఈ రకమైన కేంద్రం తొలిసారిగా కోల్‌కతాలో ఆవిర్భవించింది. ఈ కేంద్రాన్ని ప్రారంభించినప్పటినుంచి తమ శిశువుల ఆరోగ్య పరిరక్షణకు గాను తల్లిదండ్రులు బొడ్డుతాడును సంరక్షించుకోవాలనే ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇలా సంరక్షించిన రక్తం నుంచి ఆ శిశువుకు ఏ వయసులోనైనా ఎలాంటి వ్యాధి వచ్చిన సులభంగా చికిత్స చేయడం సాధ్యమవుతుంది. అవి జన్మతః వచ్చిన సమస్యలైనా జన్యుపరమైనవైనా మూలకణ చికిత్స ద్వారా తేలికగానే నయం చేయవచ్చు. సాధారణ వైద్య చికిత్స ద్వారా నయం కాని వ్యాధులను ఈ బొడ్డుతాడు పరిరక్షణ ద్వారా సేకరించిన మూలకణాలను వినియోగించి నయం చేయవచ్చునని ఇప్పటికే వేలాది కేసుల్లో రుజువైంది. ఈ కేంద్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, నియంత్రణ, మార్గదర్శకాల ప్రకారమే పనిచేస్తోంది.

ఇటీవలి కాలంలో అనేక రూపాల్లో కేన్సర్ వ్యాధి మానవాళి పాలిట పెను శాపంగా మారింది. భారతదేశంలో 70 శాతానికి పైగా పిల్లలు అనేక రకాల కేన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. బొడ్డుతాడు పరిరక్షణ వల్ల సంరక్షించుకునే మూలకణాల ద్వారా బ్లడ్ కేన్సర్‌ను నయం చేయవచ్చునని రుజువైంది. ఇందుకు సంబంధించి అనేక బ్లడ్ బ్యాంకులు ఆశాసౌధాలుగానే ఆహ్వానం పలుకుతున్నాయి. మూలకణాలను తక్షణ ప్రాతిపదికన అత్యవసర పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వాసుపత్రులు, అటు ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులు కూడా సమకూరుస్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర రక్తకణాలను దెబ్బతీసే తలసీమియా వ్యాధి పిల్లల పాలిట అత్యంత జటిల రుగ్మతగా మారింది. ఇది సోకిన పిల్లల్లో తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇలాంటి వారికి తక్షణ ప్రాతిపదికన చికిత్స చేయడం అత్యవసరం. ఇలాంటి కేసులెన్నో బ్లడ్‌కార్డ్ పరిరక్షణ వల్ల స్వల్పకాలంలోనే నయమవుతున్నాయంటే అందుకు ఈ ప్రక్రియే కారణం. శిశువుల బొడ్డుతాడును భ‌ద్ర‌ప‌ర‌చ‌డం వ‌ల‌న  భ‌విష్య‌త్ ఆరోగ్యభారతావ‌ని ఆవిష్కరణలో తమవంతు సేవనందించేవారు అవుతారు. 

మీరు కూడా ట్రై చేస్తారా మరి?  

మరిన్ని

Comments

0 Comments

ఆరోగ్యం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()