సంతానలేమికి అతిపెద్ద రీజన్ ఏమిటో తెలుసా?

img

సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? మీకు ఈ దురలవాట్లు ఉన్నాయా? స్పెర్మ్ కౌంట్ పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి? మందు తాగే వారిలో కొందరికే జబ్బులు వస్తాయెందుకు? మొదలైన ఆశక్తికర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

జనాభా నియంత్రణ పెద్ద ఆందోళనగా ఉన్న భారతదేశం వంటి దేశంలో కూడా, వంధ్యత్వ రేటు పెరుగుతోంది.

నేటి యువతరంలో సంతానలేమి పెద్ద సమస్యగా మారింది. పని ఒత్తిడి, జీవన శైలి, కాలుష్యం, ఇతర దురలవాట్ల కారణంగా వల్ల ఎంతో మందికి సంతానం కలగడం లేదు. జనాభా నియంత్రణ పెద్ద ఆందోళనగా ఉన్న భారతదేశం వంటి దేశంలో కూడా వంధ్యత్వ రేటు పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం, వంధ్యత్వం మొత్తం ప్రాబల్యం 3.9 నుండి 16.8% మధ్య ఉంటుందని అంచనా. 2013లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం పునరుత్పత్తి నిర్ణయించడంలో జీవనశైలి, అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని తేలింది. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, వంధ్యత్వానికి దారితీసే ఈ జీవనశైలి అలవాట్లు మన నియంత్రణలో ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా మీ పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపర్చుకొని సంతానలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం.

  1. ధూమపానం: ధూమపానం లేదా ఏ రకమైన పొగాకు వినియోగమైనా మీ పునరుత్పత్తికి ఆటంకం కావచ్చు. దీనితో మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పురుషులలో, ఇది మీ స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది మరియు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. మహిళల్లో, ధూమపానం గుడ్లు అండాశయాలలో ఉన్నప్పుడు దెబ్బతింటుంది. ఎక్టోపిక్ గర్భం మరియు గర్భస్రావం అయ్యే అవకాశాలను పెంచుతుంది.
  2. ఆల్కహాల్ వినియోగం: ఎక్కువగా తాగడం మూలాన కోలుకోలేని నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. అధికంగా మద్యం సేవించడం వల్ల పురుషుల్లో అనారోగ్య వీర్యం పెరుగుతుంది. మహిళలు మద్యం సేవించడం మూలాన తరచుగా అసాధారణ రుతు చక్రాలు, అండోత్సర్గ లోపాలు పెరుగుతాయి. ఈ పెరిగిన ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. ఇవన్నీ వంధ్యత్వానికి దారితీస్తాయి.
  3. సరైన నిద్ర లేకపోవడం: పేలవమైన నిద్ర అలవాట్లు అనేక అధ్యయనాల ద్వారా వంధ్యత్వంతో ముడిపడి ఉన్నాయి. తగినంత నిద్ర లేకపోవడం బరువు పెరగడానికి మరియు ఊబకాయానికి కారణమవుతుంది. డయాబెటిస్, హైపర్టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తుంది, ఇది వంధ్యత్వానికి దారితీస్తుంది.
  4. కెఫిన్ అధిక వినియోగించడం: ఒకటి లేదా రెండు కప్పుల కెఫిన్ తీసుకోవడం పెద్ద హాని కాకపోవచ్చు. కానీ మీ రోజువారీ కెఫిన్ వినియోగం క్రమం తప్పకుండా రోజుకు 400 మి.గ్రా మించి ఉంటే, అది వంధ్యత్వాని దారితీసే ప్రమాదం లేకపోలేదు. అంతేకాక ఇది గర్భస్రావం అయ్యే అవకాశాలను కూడా పెంచుతుంది.
  5. అసురక్షిత కలయిక: వంధ్యత్వానికి నిరోధించదగిన కారణం లైంగిక సంక్రమణ వ్యాధులు (ఎస్టీడీలు). అసురక్షిత పద్దతుల్లో పాల్గొనడం అనేది వంధ్యత్వానికి దారితీయవచ్చు. దీని వలన మీ పునరుత్పత్తి దెబ్బతిని, మీ ఆరోగ్యానికి అపారమైన నష్టాన్ని కలిగిస్తుంది. అసురక్షిత కలయిక కి దూరంగా ఉండండి.
  6. జంక్ ఫుడ్ వినియోగం: జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్ లేదా ఉప్పుతో నిండిన ఆహారాలు - ఇవన్నీ ఊబకాయానికి దారితీయడమే కాకుండా డయాబెటిస్, గుండె జబ్బులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి, ఇవి వంధ్యత్వానికి అవకాశాలను పెంచుతాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మరియు దీర్ఘకాలిక సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీ పునరుత్పత్తిని మెరుగుపర్చుకోవచ్చు.

 

స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం: ప్రతి దానికీ టాబ్లెట్లు, ఇంజెక్షన్లూ వాడటం మంచిది కాదు. సమస్య ఎక్కడుందో కనిపెట్టి... అది ఎందుకొచ్చిందో తెలుసుకొని... ఆ దిశగా పరిష్కారాలు ఆలోచించుకుంటే... ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

సహజంగానే శుక్రకణాల సంఖ్య పెంపుదల : ఈ రోజుల్లో ఇదో పెద్ద సమస్య. చాలా మంది బయటకు చెప్పుకోలేక, ఏం చెయ్యాలో తెలియక... కొంత మంది డాక్టర్లు చెప్పే మందులు వాడుతూ ఉన్న ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. సమస్యేంటంటే... అసలు శుక్రకణాల సంఖ్య ఎందుకు తగ్గుతోందో, అందుకు కారణాలేంటో మగవాళ్లకు తెలియాలి. అది తెలిస్తే... తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. నిజానికి ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రతీ ఆరుగురిలో ఒక మగాడికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటోంది. ఐతే... చర్యలు తీసుకున్నంతమాత్రాన అందరికీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు. కాకపోతే... సహజ చర్యల వల్ల చాలా మందికి ఫలితం కనిపిస్తోంది..

1.ఎక్సర్‌సైజ్ అండ్ స్లీప్ : బరువు అధికంగా ఉంటే, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోంది. అందువల్ల బరువు తగ్గాలి. నడవాలి, పరిగెత్తాలి, ఎక్సర్‌సైజ్‌లు చెయ్యాలి. ఒళ్లు వంగేలా చేసుకోవాలి. బట్టలు ఉతకడం, బూజు దులపడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇలాంటి పనులు మనమే చేసుకుంటే... ఒంట్లో కొవ్వు కచ్చితంగా కరుగుతుంది. రోజూ కనీసం 50 నిమిషాలు ఇలాంటి పనులు చెయ్యాలి. తద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. నిద్ర కూడా బాగా నిద్రపోవాలి. నిద్ర ఎంత ఎక్కువగా ఉంటే... మనుషులు అంత బాగా బరువు తగ్గుతారు.

2. ఒత్తిడి తగ్గాల్సిందే : ఒత్తిడి వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అందువల్ల మగాళ్లు టెన్షన్ పడకూడదు. పాటలు వినాలి. సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలి. ప్రకృతిలో తిరగాలి. పెంపుడు జంతువులతో గడవాలి. ఆడాలి, పాడాలి. మంచి సంగీతం వింటూ కాసేపు గడపాలి. ఇంట్లో వాళ్లతో కలిసి... కాసేపు ఉండాలి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గిస్తాయి. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గాలని మందులు వాడితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

3. పొగ తాగొద్దు : పొగ తాగేవాళ్లను మగాళ్లలా చూడటం ఓ దరిద్రపు సంస్కృతి. నిజానికి పొగ తాగేవాళ్లలో మగతనం తగ్గిపోతుంది. ఎంతలా స్మోకింగ్ చేస్తే... అంతలా శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. సో... స్మోకింగ్ వదిలెయ్యడమే మంచిది. మనసులో బలంగా అనుకుంటే ఏదైనా సాధ్యమే.

4. మద్యం, మత్తు పదార్థాలు వద్దు : స్పెర్మ్ కౌంట్ తగ్గించేవాటిలో ముందుంటాయి మద్యం, మత్తు పదార్థాలు. మందుబాబులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడం కంటే ఏదీ ముఖ్యం కాదు కదా. మద్యాన్ని వదిలెయ్యడమే. దాన్ని వదిలేస్తే అన్నీ లాభాలే కదా. ఇక గంజాయి, ఇతరత్రా మత్తు పదార్థాలు కూడా అస్సలు వాడకూడదు. ఇవన్నీ తీసుకునే బదులు ఫ్రూట్లు తినొచ్చు. జ్యూస్‌లు (షుగర్ వేసుకోకుండా) తాగొచ్చు. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల రుచులున్నాయి. అవన్నీ టేస్ట్ చేయవచ్చు. మద్యాన్ని వదిలేస్తేనే మేలు.

5. విటమిన్స్ తగ్గకూడదు : కొంతమందికి విటమిన్ డ్, కాల్షియం సమస్యలుంటాయి. వాటి కోసం టాబ్లెట్లు వాడమని డాక్టర్లు చెబుతారు. అలాంటప్పుడు అవి వాడటమే మేలు. డాక్టర్ల సలహాలు పాటిస్తేనే బాడీకి కావాల్సిన విటమిన్స్ అందుతాయి. అప్పుడు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. విటమిన్ డి, కాల్షియం టాబ్లెట్లను డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా కొనుక్కోవచ్చు.

6. మంచి ఆహారం తినాలి : ఈ వేపుళ్లు, ఫ్రైలు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌ల వంటివి ఎంత తగ్గిస్తే అంత మేలు. ఇవన్నీ బాడీలో కొవ్వును పెంచడానికే పనికొస్తాయి. వీటి బదులు యాంటీఆక్సిడెంట్స్ పుల్లుగా ఉండే ఫ్రూట్స్, కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఉడకబెట్టిన ఆహారమే మనకు సరైనది. అదే ఎన్నో రోగాల్ని తరిమికొడుతుంది.

7. అశ్వగంధ వాడండి : అశ్వగంధ అనేది ఆయుర్వేద మూలిక. ఇది ఎంత మంచిదంటే... మగాళ్లకు ఇదో దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. 2016లో 46 మంది మగాళ్లపై దీన్ని ప్రయోగించారు. రోజూ 675 మిల్లీగ్రాముల ఆశ్వగంధను తీసుకోమని చెప్పారు. ఇలా 90 రోజులు తీసుకున్నారు. వాళ్లందరిలోనూ శుక్రకణాల సంఖ్య 167 శాతం పెరిగింది. ఇంతకంటే ఏం కావాలి. అందుకే ఆశ్వగంధ ఓ అద్భుతమన్నమాట. మార్కెట్‌లో ఆశ్వగంధ పొడి డబ్బా దొరుకుతుంది. దాన్ని కొనుక్కొని... రోజూ పాలలో కలిపి తాగేస్తే చాలా ఉపయోగం ఉంటుంది..

ఇక మరో విషయం ఏంటంటే తాగుబోతుల్లో కొంతమందికే వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? అనేది ఎంతో మందిని తొలిచేస్తున్న ప్రశ్న..

ఆల్కహాలిక్ సిరోసిస్ వచ్చే అవకాశాన్ని తగ్గించే జన్యువును పరిశోధకులు కనుగొన్నారు. ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.

ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉన్న వారు ఎందుకు ఆల్కహాలిక్ సిరోసిస్ వ్యాధి బారిన పడుతున్నారో తెలుసుకునేందుకు చేస్తున్న పరిశోధనల్లో పురోగతి కనిపిస్తోంది. ఆల్కహాలిక్ సిరోసిస్ వచ్చే అవకాశాన్ని తగ్గించే జన్యువును పరిశోధకులు కనుగొన్నారు. ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. ఆల్కహాలిక్ సిరోసిస్ దుష్ప్రభావాలను ఎలా నివారించాలనే విషయంపై వారు అధ్యయంనం చేస్తున్నారు. ఏళ్ల తరబడి మద్యం తాగే అలవాటు ఉన్నవారు ఆల్కహాలిక్ సిరోసిస్ బారిన పడే అవకాశం ఉంది. తమ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ఎపటాలజీ జర్నల్‌లోనూ ప్రచురించారు.

మద్యం కారణంగా అమెరికా యువతలో కాలేయ సంబంధ వ్యాధులు అధికమవుతున్నాయని పరిశోధన బృంద సభ్యుడు సుతాంగ్ లియంగ్ పున్సకుల్ తెలిపారు. ఆయన నేతృత్వంలోనే ఈ అధ్యయనం జరుగుతుంది. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఇన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి డీన్‌గా పనిచేస్తున్నాడు. యుక్త వయసులో మద్యానికి బానిసైన వారికి వచ్చే అనారోగ్య సమస్యలు ప్రజా సమస్యగా మారే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. జెనోమ్ ఏఎల్సీ కన్సార్టియం కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్కఙాలిక్ అబ్యూజ్ అండ్ ఆల్కఙాలిజమ్ అనే సంస్థ నిధులు సమకూరుస్తోంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఒక భాగం. జెనోమ్ సంస్థ అధ్యయనం కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఆల్కహాలిక్ సిరోసిస్కు సంబంధించి ఇదే అతిపెద్ద అధ్యయనమని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అమెరికా, యూరప్ తదితర దేశాల నుంచి దాదాపు 1700మంది డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఐయూ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో వీటికి సంబంధించిన డీఎన్ఏ ఎనాలిసిస్ చేశారు. వీరిలో మొత్తం రోగులను రెండు భాగాలుగా విభజించారు.

కాలేయ సంబంధ వ్యాధులకు గురికాని తాగుబోతులను మొదటి బృందంలో ఉంచారు. రెండో గ్రూపులో ఆల్కహాలిక్ సిరోసిస్ వ్యాధికి గురైన తాగుబోతులను ఉంచారు. దీనికి సంబంధించిన వివరాలను పరిశోధన బృంద సభ్యుడు తై ఇవి వివరించారు. ఎఫ్ ఏ ఎఫ్ 2 అనే జన్యువును మేము గుర్తించామని ఆయన చెప్పారు. ఫస్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్ ఫ్యామిలీ మెంబర్ 2 అనేది దీని పూర్తి పేరు. లిపిడ్ డ్రాప్లెట్ పాత్వేకు సంబంధించిన జన్యువులను విశ్లేషిస్తున్నాం. కొంతమంది తాగుబోతులకు ఎందుకు త్వరగా ఆల్కహాలిక్ సిరోసిస్ వస్తుంది, మరికొందరు ఎందుకు ఈ వ్యాధి బారిన పడట్లేదో దీని నుంచి తెలుసుకుంటున్నాం అని ఆయన వివరించారు. ఈ జన్యువుపై మరిన్ని పరిశోధనలు చేసిన తరువాతే పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు.

"జన్యువుల జీవక్రమంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. విభజించిన రెండు గ్రూపుల సభ్యుల సభ్యుల్లో ఆ జన్యువు ఏవిధంగా మారుతుందో గుర్తించాలి. ఒక్కో వ్యక్తికి సంబంధించిన జన్యువుల జీవక్రమాన్ని తెలుసుకున్న తరువాతే, మేం కనుగొన్న జన్యువు వారి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో తెలుస్తుంది" అని ఆయన వివరించారు. మొత్తానికి ఈ పరిశోధన పూర్తయిన తరువాతే ఒక్కో వ్యక్తికీ ఆల్కహాలిక్ సిరోసిస్ను నయం చేసేందుకు వ్యక్తిగతంగా చికిత్స అందించే అవకాశం ఉంది.

కనుక ఇప్పుడు మనం చర్చించుకున్న అంశాలన్నీ ద్రుష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే సంతానలేమి సమస్యను దూరం చేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.. 

మరిన్ని

Comments

0 Comments

ఆరోగ్యం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()