బిస్కట్స్! మన డైలీ లైఫ్ లో ఇవొక భాగం.. ఎంతో మంది వీటిని టీ, కాఫీ లలో కూడా డిప్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు.. ఇండియన్స్ కి బిస్కట్స్ కి మధ్య అవినాభావ సంభందం ఉంది.. వీటిలో అనేక వెరైటీ లు మార్కెట్ లో దొరుకుతాయి. సాల్టీ, క్రీమీ, మిల్కీ ఇంకా మరెన్నో.. ఐతే మీరు ఎప్పుడైనా ఆయా టేస్టీ బిస్కట్స్ తయారు చేసేటప్పుడు వాడే ఇంగ్రెడియంట్స్ గురించి తెలుసుకున్నారా? వీటిలో సుగర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఆయిల్స్ మొదలైన వాటిని సహజంగా వాడుతుంటారు.. అయితే మీలో ఎవరైనా వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నా, హెల్దీ లైఫ్ స్టైల్ కోరుకుంటున్నా, ఇప్పుడు చెప్పుకోబోయే విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.. పనిలో పనిగా ఎలాంటి బిస్కట్స్ మన ఇండియన్ మార్కెట్ లో బెస్ట్ ఆప్షన్ అనేది కూడా తెలుసుకుందాం..
బాగా పాపుల బిస్కట్స్ మన మార్కెట్ లో దొరికేవి గనక దగ్గరగా అబ్జర్వ్ చేస్తే వాటిలో వాడే పదార్ధాలు ఏమిటో తెలిసిపోతుంది.. వీటిని సులభంగా అర్ధం చేసుకోవడానికి మనం వీటిని నాలుగు క్యాటగిరీలుగా విభజిద్దాం..
మొదటి క్యాటెగిరీ లో భాగంగా కొన్ని బిస్కట్స్ ని తీసుకుందాం.. ముఖ్యంగా సన్ ఫీస్ట్, డార్క్ ఫ్యాంటసీ, మిలానో, ఓరియో, హైడ్ అండ్ సీక్, బోర్ బార్న్, ట్రీట్ మొదలైన క్రీం బిస్కట్స్ ని తీసుకోవచ్చు.. ఇవి పిల్లలతో పాటూ పెద్ద వాల్లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.. అయితే ఇవే అన్ని వెరైటీ బిస్కట్స్ కన్నా అనారోగ్యకరమైనవని పరిశోధనల్లో తేలింది.. ఉదాహరణకి ఓరియో బిస్కట్స్ తీసుకుంటే 100 గ్రాముల బిస్కట్స్ లో 70 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మిశ్రమం ఉంటుంది.. ఇందులో 30% సుగర్ కంటెంట్ ఉంటుంది.. అంటే 10 టీ స్పూన్స్ సుగర్ తీసుకుంటే ఎంత పరిమాణం ఉంటుందో అంత.. అంటే 5 బిస్కట్స్ ఉన్న ఒక ప్యాకెట్ లో 10 టీ స్పూన్స్ సుగర్ ఉంటుంది.. ఇంకా వీటిలో ఫ్యాట్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..
ఇక రెండో క్యాటెగిరీ విషయానికొస్తే మొదటి క్యాటెగిరీ బిస్కట్స్ కన్నా ఇవి కొంచం బెటర్ అని చెప్పవచ్చు.. ముఖ్యంగా పార్లె జి, టైగర్, గుడ్ డే, మ్యారీ గోల్డ్, పతాంజలి, క్రాక్ జాక్ మొదలైనవి ఈ క్యాటగిరీ కిందకు వస్తాయి.. వీటిలో 20% సుగర్ మాత్రం ఉంటుంది.. కానీ ఇవి అన్నిటికంటే బెస్ట్ బిస్కట్స్ అని చెప్పడం కష్టం..
ఇక మూడో క్యాటెగిరీ లో బ్రిటానియా న్యూట్రి చాయిస్, సన్ ఫీస్ట్ ఫాం లైట్, ఓట్ బిస్కట్స్ మొదలైనవి ఉంటాయి..
అయితే ఇవి బెస్ట్ ఆ? అంటే కాదు.. ఓట్స్ కుకీస్ విషయానికొస్తే అవి ఒక మార్కెటింగ్ స్టంట్ గా చెప్పొచ్చు.. ఈ వోట్స్ బిస్కట్స్ లో 2% నుండి 4% ఓట్స్ కంటెంట్ మాత్రమే ఉంటుంది.. మిగతా కంటెంట్ మొదటి రెండు క్యాటెగిరీ లలో ఉన్న కంటెంట్ ఉంటుంది.. వీటిలో ఆర్టిఫిషియల్ స్వీట్ ఉపయోగిస్తారు.. ఈ మిశ్రమం ఉన్న బిస్కట్స్ పిల్లలకు సూటబుల్ కాదు అని ఆ ప్యాకెట్స్ పైన మెన్షన్ చేస్తారు కూడా.. సో ఇవి చాలా ప్రమాదకరం.. దీనర్ధం ఈ బిస్కట్స్ తినడం కన్నా డైరెక్ట్ గా సుగర్ తినడం ఉత్తమం..
మరి బిస్కట్ లవర్స్ ఇప్పటికే డిజప్పాయింట్ అయి ఉంటారు కదా? ఐతే మీకోసమే నాలుగో క్యాటగిరి బిస్కట్స్ వివరాలు ఇప్పుడు తెలియజేస్తున్నాము, ఒకసారి చూడండి..
ఇవి ప్యూర్ హోల్ గ్రెయిన్ తో తయారు చేస్తారు.. ఉదాహరణకి "గ్రైనీ" బిస్కట్స్.. "అమరంత్ ఆల్మండ్ కుకీస్", "గ్రైనీస్ మైండ్ ఫుల్ కుకీస్".. వీటిలో స్వీట్, సాల్టీ బిస్కట్ వెరైటీస్ ఉంటాయి.. "జాగరీ కుకీస్" మరొక ఆప్షన్.. ఇవి ఎక్కువ కాస్ట్ ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం మీకు ముఖ్యం అని మీరు ఫీల్ అయితే ఈ నాలుగో క్యాటెగిరీ బిస్కట్స్ కొనుక్కుని తినండి..
సో, తెలిసింది కదా బిస్కట్స్ లో ఏవి మంచివి, ఏవి అనారోగ్యాన్ని కలిగించేవి అని? సో, గో ఫార్ బెటర్ కుకీస్ ఆల్వేస్... టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్..
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments