సన్ బర్న్ అయితే కచ్చితంగా నయం అవ్వడానికిరెండు రోజులు పడుతుంది. కనుక సన్ బర్న్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కమిలిన చర్మం వల్ల నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వాడచ్చు. అలోవెర జెల్ లేదా కేలమైన్ లోషన్ చర్మం మీద రాయడం వల్ల దద్దుర్లు పోతాయి. చల్లని పాలతో మసాజ్ చేయడం మంచిది.ఇలా చెయ్యడం వల్ల వెంటనే ఉపసమనం కలుగుతుంది.
అలానే కీర దోసను మిక్సీలో వేసి ఆ మిశ్రమాన్ని చర్మం పై రాసుకోవాలి. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కొన్ని చుక్కల బ్లాక్ టీని కమిలిన చర్మానికి అప్లై చేస్తే పరిష్కారం ఇస్తుంది.కమిలిన తర్వాత సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల ఫలితం ఉండదు,కాబట్టి బయటకు వెళ్లేముందు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.
ఈ సన్ బర్న్ నుంచి ఉపశమనం రావడం లేదని అనుకుంటే డాక్టర్ ను కలవడం మేల. ఎండలో అత్యవసర పరిస్థితి వస్తే తప్ప వెల్లకూడదు, ఒకవేళ వెళ్ళాలంటే గొడుగు మరియు టోపి వంటివి వెంట తీసుకొని వెళ్ళాలి. ఇంకా ముఖ్యమైనది కాటన్ దుస్తులు, వదులైనవి ధరించాలి.నలుపు, ముదురురంగు దుస్తులు వేసుకోకూడదు.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments