వేసవిలో ప్రతీ ఒక్కరూ కూడా ఇట్టే అలసిపోతారు. అలానే ఆ వేడికి బాగా నీరసం అయిపోతారు. పిల్లలు కూడా ఎక్కువ ఆడుకుని అలిసిపోయి ఇట్టే ఎండవల్ల ఎనర్జీ తగ్గి పోయి బలహీనం అయిపోతారు. అయితే వీటి అన్నింటినీ కాక మరెన్నో పరిష్కారాలు ఇస్తుంది పుచ్చకాయ.
వేసవి తాపాన్ని తొలగించడానికి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. ఈ పుచ్చ కాయ నిండా నీరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్‌లో దీనిని వాటర్‌మెలన్ అని అంటారు. దీన్ని ఖర్బూజ అని కూడా అంటారు. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. అంతేకాదు పుచ్చకాయలో విటమిన్ ఏ,బి6,సి మరియు యమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గుండె ఎంతో ఆరోగ్యంగా మారుతుంది.
జీర్ణప్రక్రియకు ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయకు బాగా చలవచేసే గుణం ఉంది. ఒక పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. కనుక బరువు తగ్గడం లో బాగా ఉపయోగపడుతుంది. అలాగే మధుమేహానికి చాలా మంచిది అని పరిశోధనలు తెలియజేశాయి.
మూత్రవ్యాధులన్నిటినీ నివారించగలే గుణం దీనికి ఉంది. దంత క్షయం వంటి సమస్యలు దరిచేరవు. రక్తపోటున్నవారు పుచ్చకాయలను ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక వేసవి కాలంలో దొరికే ఈ పండును తినాల్సిందే...
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments