సహజంగా మనం సాంబ్రాణి ధూపం లో వేయడం తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి పొగ వేయడం వంటివి చేస్తాం కానీ నిజంగా సాంబ్రాణి ఆరోగ్యానికి ఏమైనా మేలు చేస్తుందా...? అవును సాంబ్రాణి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
సాంబ్రాణి ఆయుర్వేదం లో కీళ్ళనొప్పుల నివారణకు జీర్ణక్రియ, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. వివిధ రకాల లేహ్యాల్లో కూడా సాంబ్రాణి వాడతారట. అలానే ఆయుర్వేద మందుల్లో కూడా సాంబ్రాణి వాడతారట. సాంబ్రాణి ఆస్తమా, అల్సర్, క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందుల్లో ఉపయోగిస్తారు.
దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు కలిగి ఉంటాయి. దీని నుంచి తీసిన నూనెను టూత్ పేస్ట్ , ఆయింట్మెంట్లు తయారు చేయడానికి మందుల్లో వాడతారట. అంతేకాదు దీనిని దూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అట.
అయితే సామ్రాణి వల్ల మానసిక రుగ్మతలను దూరం చేసే అరోమా థెరపీ లోను కూడా దీన్ని ఉపయోగిస్తున్నట్లు చెప్తున్నారు. అలానే ఈ సువాసన మనసు ఉత్సాహంగా ఉంచుతూ డిప్రెషన్ వంటివి దూరం చేస్తుంది.
ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే నేటికి కూడా సాంబ్రాణి ఉపయోగిస్తున్నారు. చక్కటి సువాసన ఇచ్చే ఈ సాంబ్రాణి లో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని ఎవరికీ తెలియదేమో...? అయితే ఆలస్యం ఎందుకంటే మీ ఇంట్లో కూడా సాంబ్రాణి తరచు వాడుతూ ఈ సమస్యలకి సులువుగా మీరే పరిష్కారం చూపండి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments