నిత్యం మనం డిజిటల్ వస్తువులనే వాడుతూ ఉంటాం. అలానే సమయం వాటి తోనే గడుపుతాం. ఫోన్ ల్యాప్ టాప్, కంప్యూటర్, టీవీ ఇలా ఏదో ఒక దానితో నిమగ్నమై పోతుంటారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మరీ ఎక్కువైపోయింది. ఇళ్లలోంచి బయటకు వెళ్ళకుండా కేవలం టీవీ కంప్యూటర్లకు పరిమితమయ్యారు ఇప్పటి జనం. దీని వల్ల కళ్ళు బాగా అలసి పోతాయి.
కళ్ళు అలసిపోతే కళ్ళు నొప్పులు, మంట ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి ఉపశమనం ఎలా కలుగుతుంది? ఆలస్యమెందుకు ఈ టిప్స్ ని ఫాలో అయిపోండి....
వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండటం మంచిది.
అస్తమానం ఫోన్ లో టీవీ లో కాకుండా వేరే విధంగా మన పని చేయడం మంచిది.
ఫోన్లో ఉన్న ఆటలని కాకుండా బయట ఉండే ఆటలు, వ్యాయామం కలిగించే ఆటలు ఆడుకోవడం మంచిది.
లేదా బోర్డ్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి చెస్ , క్యారమ్స్ ఇటువంటి వాటిపై దృష్టి మార్చుకోవడం కూడా ఉత్తమం.
అలానే నచ్చిన కళలు పై దృష్టి పెట్టడం కూడా మంచిదే. డ్రాయింగ్, పెయింటింగ్ , స్టోరీ రైటింగ్ ఇటువంటి వాటిపై కూడా శ్రద్ధ పెట్టడం ఎంతో మంచిది.
అలిసిపోయిన కళ్ళు కి వ్యాయామం ఫోకస్ చేంజ్. కుడి చేతి 4 వేళ్ళని మూసి చూపుడు వేలిని కళ్ళకు పది అంగుళాల దూరంలో ఉంచాలీ. ఆ వేలు పైనే పూర్తి దృష్టి పెట్టండి నెమ్మదిగా వేలుని పక్కకు కదిలించండి. కానీ చూపు అసలు మారకూడదు. అదే డైరెక్షన్లో దూరంగా ఉన్న ఏదో ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించండి. ఇప్పుడు మళ్లీ చూపుడు వేలు పై దృష్టి మార్చేసి మళ్ళీ నిదానంగా వేలిని కళ్ళ దగ్గరకు తీసుకెళ్ళండి. మరలా దూరంగా ఉన్న వస్తువు చూడండి ఇలా మూడుసార్లు చేయాలి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments