కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా బాగుండాలి. ఇమ్యూనిటీ ఆహారంతో పొందవచ్చు. ఇదే కాకుండా ఒత్తిడిని అదుపులో ఉంచుతూ కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఒత్తిడి ఎంతో కొంత ఉండడం సహజం కానీ తీవ్రత ఎక్కువగా ఉంటే అది రోగ నిరోథక శక్తి పై ప్రభావం చూపుతుంది, అందరిలోను ఒత్తిడి ఒకేలా ఉండదు కాబట్టి ఒత్తిడి పొందే పనులకు, విషయాలకు దూరంగా ఉండటం మేలు ఇది ఎంతో అవసరం ఎందుకంటే మనకు తెలియకుండా మన రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది.
ఇక ఆరోగ్య సూత్రాలు ఏమిటంటే క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. అలా అని శక్తికి మించి చేయకూడదు. ఇలా చేయడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. శరీర శుభ్రత ఎంతో అవసరం ఎలాంటి క్రిములూ దరిచేరకుండా చర్యలు తీసుకోవాలి.
రోజుకి 6-8 గంటల నిద్ర తప్పనిసరి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఎ, సి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇలా ఒత్తిడిని అదుపులో ఉంచుకుని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది.
అలానే ఇది వేసవి కాలం కాబట్టి దాహం వేస్తుంది అలానే బాగా డిహైడ్రేట్ అయిపోతాం. అలాంటి సమయం లో కూల్ డ్రింక్స్ తాగకూడదు, కొబ్బరినీరు, సబ్జా,బార్ళీ, నిమ్మరసం వంటివి తాగాలి. ఎండలో అత్యవసర పరిస్థితి వస్తే తప్ప వెల్లకూడదు వెళ్ళాల్సి వస్తే తగిన చర్యలు తీసుకోవాలి. ఇలా ఈ చర్యలని పాటించడం ఎంతో అవసరం.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments