వేసవి లో తప్పక పాటించాల్సిన విషయాలు...
ఎండలు మండిపోతున్నాయి,శరీరంలో ని వేడిని ఎలా తగ్గించుకోవాలి అని సందేహమా?ఆలోచన వద్దు ఈ రోజు నుండి మీ ఆహార పద్దతులు మార్చుకోండి ఎందుకంటే ఈ ఒక్కటి మనల్ని ఆరోగ్యంగా మార్చుతుంది. శరీరం చలువ చెయ్యాలి అంటే కొబ్బరినీరు ఉత్తమం.
రోజుకు రెండు మూడు గ్లాసులు తాగడం వల్ల డీహైడ్రేషన్ కూడా జరగదు. తాజాగా ఉన్న కీర,అనాస,ముల్లంగి,పాలకూర,ఉల్లి, వెల్లుల్లి శరీరం లో వేడిని తగ్గించుతాయి. రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగడం ఎంతో మేలు.
ఒక గ్లాసు చల్లని పాలల్లో ఒక చెంచా తేనె ను కలుపుకొని తాగితే మంచిది. ఇలా చెయ్యడంతో వేడి మొత్తం పోతుంది. సబ్జా గింజలను నానబెట్టి వాటిని తాగడం వల్ల కొద్ది సేపటికే వేడి తగ్గుతుంది. ఇలాగే బార్లీ మరిగించి ఆ నీరు త్రాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.
గంథం పేస్టును నుదుటి పై రాస్కోవడంతో వేడి నుంచి విముక్తి పొందవచ్చు ఇదే కాకుండా అలోవెరా జెల్ కూడా ముఖానికి రాసుకోవచ్చు. నిమ్మ రసం కలిపిన నీరు తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గించి శక్తిని ఇస్తుంది. మెంతులు తో చేసిన కషాయం లేదా టీ తాగితే అనవసరమైన టాక్సిన్స్ బయటకు పోతాయి దీంతో శరీరం చల్లబడుతుంది. ఇలాంటి చిట్కాలు వేడిని తగ్గించుతాయి. ఆహారంతోనే కాకుండా శీతలీ ప్రాణాయామం ద్వారా వేడిని పోగట్టుకోవచ్చు.ఈ ప్రాణాయామం రోజూ చేస్తే ప్రయోజనం తప్పక ఉంటుంది.
మరిన్ని
0 Comments