ఎండలు మండుతున్నాయి 10 తరువాత బయటకు వెళ్ళడం చాలా కష్టం. చాలా మంది చల్లబాటు వేళళ్ళోనే బయటకు వెళ్తారు. బయటకు వెళ్లి వచ్చాకా లేదా అథిక ఉష్ణోగ్రతలు ఉన్నా సరే కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే తాజా పండ్లు, మజ్జిగ, కొబ్బరినీరు,ఐస్ క్రీమ్,మిల్క్ షేక్స్ వంటివి తీసుకోవడం మంచిది.
వీటి వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. కానీ మిల్క్ షేక్స్ కూడా బయట నుంచి విక్రయించడం మానుకోవాలి. ఎంతో సులువుగా వీటిని తయారు చేసుకోవచ్చు. ముందుగా పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ మిల్క్ షేక్. ఒక గ్లాస్ పాలు లో చాక్లెట్ సిరప్, చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసి బ్లెండ్ చేస్కోవాలి. తరువాత ఫ్రిజ్ లో పెట్టుకుని తాగేముందు విప్ చేసిన క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
బనానా మిల్క్ షేక్ కూడా చాక్లెట్ లానే ఇందులో చాక్లెట్ బదులు వెన్నిల ఐస్ క్రీమ్, అరటిపండు వేసి బ్లెండ్ చెయ్యాలి, చాక్లెట్ సిరప్ ఇష్టమైతే పైన వేసుకొని తాగచ్చు.
బనానా చేసినట్టే పైనాపిల్,మ్యాంగో కూడా చేసుకోవాలి. ఏ మిల్క్ షేక్ చేసినా ఒక కప్పు పాలు కి 3స్కూప్స్ ఐస్ క్రీమ్ వేసుకుంటే మిల్క్ షేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. తక్కువ ఫ్యాట్ ఉన్న ఐస్ క్రీమ్ వాడితే
మంచిది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments