మన పెద్దలు ఆహారాన్ని సమపాళ్లాలో తీసుకుంటే ఇంకా ఏ ఔషధం అవసరం లేదు అని నమ్మేవారు, కనుక సరైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండేవారు. ఈతరం లో మనం ఆరోగ్యం కోసం ప్రాకులాడుతూ ఆహారాన్ని, ఔషధాన్ని కలిపి తింటున్నాం........ ఇది ఎంత వరకు సభవు????
అసలు ఔషధంలా పని చేసే ఆహారం ఏమిటి????
వంట లో మనం జోడించే సామాన్లు, ముఖ్యంగా పోపు లో వేసే ఆవాలు, జీలకర్ర, వాము, ధనియాలు, యాలకులు, మెంతులు.. వీటన్నిటికి ఒక్కో ప్రత్యేకత ఉంది. జీలకర్ర, వాము జీర్ణశక్తి ని పెంపొందిస్తాయి, వాటి వల్ల జీర్ణ కోశం చక్కగా ఉంటుంది. లవంగాలు, యాలకులు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. అలాగే మన భోజనము లో చివరి అంశమైన మజ్జిగ జాఠరాగ్నిని వృద్ధి చేసి ఇప్పటి వరకు తిన్న భోజనమును జీర్ణం చేస్తుంది.
అలాగే నెయ్యి, పాలు, ఉసిరికాయి, తేనె, పెసలు, వెన్న, నువ్వులు, ఋతువుల అనుసారం దొరికే పండ్లు, కూరలు, మొదలగు పదార్థములను నిత్యము సేవించినట్టయితే ఔషధం అన్న మాటే మన దరి చేరదు. అలా కాకుండా మనం, అదేనండీ నేటి తరం వారం, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాశ్చాత్య సంప్రదాయాలు చూసి మన ఆహారాన్ని విస్మరించి, పిజ్జా లు, బర్గర్లు, శీతల పానీయాల వెంట పడ్డాం. అప్పుడప్పుడు అన్నట్లు తింటే పరవాలేదు...... మరి మనం????
వయస్సు కు వచ్చిన ఆడపిల్లలకు నువ్వులు ఉండ ఇచ్చేవారు ఆకాలం బామ్మలు, కారణం లేకుండా కాదండోయి, అది నెలసరి ని క్రమంలో ఉంచుతుంది అనే. వారు గానుగ నూనె,నెయ్యి లేకుండా ఏనాడూ అన్నం తినలేదు వారు. ఎందుకంటే ఇంత నెయ్యి అంత బలము అని వారికి తెలుసు కనుక. ఇక పాలు, పుట్టినప్పటినుండి రోజు పాలు ఇచ్చి పెంచుతారు ఎందుకంటే అది మన ఎముకలు, శరీరము యొక్క ఎదుగుదల కు ఎంతో సహాయ పడుతుందని వారు ఎరుగుదురు.
ప్రతి వంటలో వేసే పసుపు క్యాన్సర్ లాంటి ఎన్నో రకాల అనారోగ్యాల నుండి కాపాడుతుంది కనుక. ఇక పోతే గంజి, కడుపు చలవ అని వినేవుంటాం మరి. అలాగే ఎదుగుదలకు ద్రాక్షాలు, ఖర్జూరము అవసరం అని తెలిసు గనుకనే అమ్మమ్మ కొసరికొసరి తినిపించేది మరి.
అలాగే ఆ కాలమున వారు మాంసాహారం కూడా వారానికి ఒక్క సారి తినేవారు మరి. ఇక పాత బెల్లం,వేరుశనగలు,చెరుకుముక్కల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు,అలాగే వులవలు,బార్లీ,గోధుమలు వీటి యొక్క అద్భుతమైన ఉపయోగాలు ఆయుర్వేదం లో క్షుణ్ణంగా వివరింపబడ్డాయు. ప్రతి పండుగ దినమున మన వారు చేసే ప్రతి పని వెనుక, వండే వంట వెనుక తప్పకుండా కారణం ఉండి ఉంటుంది, కానీ మనకు తెలియదని అవన్నీ చాదస్తాలంటే ఎలా చెప్పండి???
తినే అలవాట్లు గురించి చాలా మందిక తెలియసుకోవల్సిన కొన్ని విషయాలున్నాయి అదేంటంటే, పాలు తాగాకా ముల్లంగి మొదలగు దుంపలు తినడం, చేప తో పెరుగు, పాలు ఇంక పుల్లని ఆహారపదార్థాలు, తేనె నెయ్యి సమపాళ్ళలో.. ఇంకా ఇలాంటి మనకు తెలియనివి నిత్యము మనం సేవించడం వల్ల రోగాలు దరిచేరడానికి ఆస్కారం ఎక్కువ. కావున ఇలాంటి వాటికే కాకుండా పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు వీలైనంత దూరంలో ఉండడం మంచిది. అప్పుడు అప్పుడు అయితే పరవాలేదు కానీ అదే మన నిత్యమైన ఆహారముగా మారితే మన ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నట్లే మరి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments