ఉష్ణోగ్రత రోజు రోజు కి పెరుగుతున్నాయి,కనుక అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి,అందాన్ని కూడా కాపాడుకోవాలి. ఇలా అందంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎండలో అత్యవసర పరిస్థితి వస్తే తప్ప వెల్లకూడదు, ఒకవేళ వెళ్ళాలంటే గొడుగు మరియు టోపి వంటివి వెంట తీసుకొని వెళ్ళాలి. ఇంకా ముఖ్యమైనది కాటన్ దుస్తులు, వదులైనవి ధరించాలి.
నలుపు, ముదురు రంగు దుస్తులు వేసుకోకూడదు.ఆహారం తీసుకోవడం లో చాలా మార్పులు చెయ్యాలి ఎందుకంటే వేసవి కాలంలో డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి .పుచ్చకాయ,కీరదోసకాయ,సబ్జా గింజలు, బార్లీ ,కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి రోజు ఆహారం తో తీసుకోవాలి వీటి వల్ల శరీరంలో తేమ బయటికి పోదు.
మసాలాలు,కారాలు తగ్గించి వంటలు చేస్కోవడం వల్ల సహజ ఖనిజాలు శరీరం లోనికి వెల్తాయి. రోజూ పుదీన తినడం వల్ల వేడి శరీరం నుంచి పోతుంది. రకరకాల టిఫిన్లు కంటే పెరుగన్నం ఎంతో మేలు. శీతల పానీయాలు కంటే సహజ సిద్ధమైన షర్బత్ లు తాగడం మంచిది.
ఇలా పాటించడం వాళ్ళ ఎండ కి నీరసం అయిపోకుండా చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా బయట మసాలా ఫుడ్ ని కట్టిపెట్టి. ఇంట్లో చేసినవి తినడమే ఎంతో మేలు. కాబట్టి ఈ క్రమాన్ని ఫాలో అవ్వండి. అందంగా, ఆరోగ్యంగా ఉండండి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments