ఆల్కహాల్ నిజంగా అంత ప్రమాదకరమా? హ్యాంగ్ ఓవర్ ని తగ్గించేందుకు పరిష్కారాలు పని చేస్తాయా?
నిజంగా మనం ఎంతో మంది ఆల్కహాల్ కి బానిసలు అయ్యి పోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. ఆల్కహాల్ కంటెట్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ పాడైపోయి చనిపోయారు అని కూడా ఎన్నో సార్లు విన్నాం. ఇంత ప్రమాదకరమైన ద్రవ్యాన్ని ఎందుకు తీసుకుంటారు? దీని వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి?
ఆల్కహాల్ వల్ల ప్రమాదం ఎలా జరుగుతుంది?
ఆల్కహాల్ ని లిమిట్ దాటి తీసుకోవడం వల్ల మొదట మాట తడబడుతుంది. అవయవాల సమన్వయం లో అనేక మార్పులు రావడమే కాక స్థిరం గా నడక ఉండక నడక లో ఎంతో తేడా ఉంటుంది. ఆలోచన రాక మెదడు పని తీరు తరిగి పోతుంది. శ్వాస క్రియ దెబ్బతినడింటుంది. అంతే కాకుండా ఇలా జరగడం వల్ల మరణాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఆల్కహాల్ వల్ల పైకి బరువు పెరిగినా శరీరం సామర్ధ్యాన్ని కోల్పోతుంది. ఆరోగ్యానికి ప్రమాదకరం ఈ ఆల్కహాల్ ని సేవించడం.
హ్యాంగ్ ఓవర్ నుండి బయట పడడానికి మార్గాలు:
ఆల్కహాల్ ని తీసుకోకుండా ఉండడం
సరిగ్గ వేళ కి తినడం
చక్కగా సమయానికి నిద్ర పోవడం
వీటిని అనుసరిస్తూ ఆల్కహాల్ ని మానేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం. మరెందుకు ఆలస్యం మధ్యం సేవించకుండా ఆరోగ్యాన్ని గెలుచుకోండి
మరిన్ని
0 Comments