ప్రతి మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికెే ఇష్టపడతారు. అసలు రోగాలే దరిచేరకుండా ఉండాలని కోరుకుంటారు, వాటి కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ మనం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నామా అని తెలుసుకోవడం ఎలా???
"సమదోషసమాగ్నిశ్చసమధాతుమలక్రియ:
ప్రసన్నాత్మేన్దింద్రియమనా: స్వస్థఇత్యభిధీయతే"
మన ఉపవేదాలలో ఒకటైన ఆయుర్వేదంలో చెప్పబడిన విధంగా మన శరీరము మూడు దోషమును అవే వాతం, పిత్తం, కఫం. సప్త ధాతువులు, పదమూడు రకాల అగ్నిలు, మూడు మలాల తో కూడుకోబడినది. వీటితో పాటు మనసు, పంచ ఇంద్రియములు, ఎప్పుడైతే సమావస్తలో లో ఉంటాయో అది ఆరోగ్యం అని, హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు రోగమని మహర్షిలు వివరించారు. అలాగే మనం తినే ఆహారం రెండు భాగములుగా విభజించబడుతుంది. ఒకటి సారముగా ఇంకొకటి కిట్టము అంటే వ్యర్థము అన్నమాట. సార భాగము చేత నే శరీరము వృద్ధి పొంది సప్త ధాతువులు గా మారుతుంది.
"రసాసృక్మాంసమేధోస్తిమజ్దాశుక్రానిధాతవ:"
ఆహార రసము > రసధాతువు>రక్తము >మాంసము>మేదసు>అస్తి >మజ్జము >శుక్రము.
అలాగే మన శరీరము లో ఉన్న మూడు వ్యర్థమైన పదార్థములు మలము, మూత్రము, స్వేధము, ఇవి ప్రతి రోజు బయటికి రాకుండ ఉంటే అది విరుద్ధమైన ప్రక్రియ, దానర్థం మనం రోగావస్తలో ఉన్నామని.
ఇక పోతే మన శరీరము నడిపించు ఇందనమే మన జాఠరాగ్ని.
"అహం వైశ్వానరోభూత్వాప్రాణిణాందేహమాశ్రితం
ప్రాణపానసమాయుక్తంపచామ్యన్నంచతుర్విధం"
మనలో ఉండే అగ్నే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, భగవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్పారు, ఆ జీవాగ్నిని నేనే అని. మన ఆయుర్వేదం లో కూడా "రోగాసర్వేపిమందాగ్నౌ" అంటే ప్రతి రోగమునకు కారణం మందంగా ఉన్న మన జాఠరాగ్నే అని. ఎందుకనగా ఆ అగ్నే లేకపోతే ఏ క్రియా జరగదు గనుక, ఎలా అయితే హోమంలో వేసే నెయ్యి ఆ మంట ను పెంపొందించడానికి సహాయపడుతుందో, మన లో ఉన్న అగ్ని చెంచా నెయ్యి వెయ్యగానే తక్షణమే వృద్ధి నొందుతుంది.
సరైన అగ్ని లేనప్పుడు ఎంత మంచి ఆహారాన్ని తిన్నా వ్యర్థమే కదా?? కావున మన అగ్నిని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మనం ఈ కొత్త రకం వింత ఆహారాలవాట్లతో జాఠరాగ్ని ని నాశనము చేసుకుంటున్నాము.
ఒక వేళ ఆకలి వేయకపోయినా లేదా ముందు తిన్న భోజనము జీర్ణం కాకపోయినా లేదా మల, మూత్ర విసర్జన కాకపోయినా కూడా ఆపూట ఆహారం తీసుకోకపోవడమే ఉత్తమం. ఇలాంటి సందర్భాల్లోనూ మనం ఆహారం తింటే అగ్ని ని ఇంకా బలహీన పరచుచు రోగాలను ఆహ్వానించువారమవుతాం.
మొత్తానికి ఎవరిలో అయితే అగ్ని సమావస్తలో ఉంటుందో, వారి లో దోషాలు, ధాతువులు కూడా సమావస్తలో ఉంటాయి, ఎప్పుడైతే మనలో జరగాల్సిన ప్రక్రియలు సరిగ్గా జరుగుతాయొ,, అప్పుడు మనసిక ప్రశాంతత కూడా ఉంటుంది. ఎవరయితే మానసిక మరియు శారీరకంగా బాగావుంటారో వారినే ఆరోగ్యవంతులనగలం, ఈరోజున చూసే ఎలాంటి వ్యాధులకైనా మనం స్వస్తి చెప్పి స్వాస్థ్యులు గా నిలవగలం.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments