సహజంగా మనం పూజకు అలంకరణకు ఉపయోగిస్తాం. కానీ వైద్యానికి కూడా పనికి వస్తాయి. పూల ద్వారా వైద్యం ఎలా చేయాలి..? మరి తెలుసుకోలేకపోతున్నారా..? చదివేయండి...
వేప పువ్వు సేవించిన వారికి ఎటువంటి అనారోగ్యం రాదు. అంతే కాక చర్మవ్యాధుల నివారణకు కూడా వేప సహాయ పడుతుంది. వేపని అందుకే దివ్యౌషధమని అంటారు. కాబట్టి వేప పువ్వు ఎంతో మంచిది.
అరటి పూలతో చాలామంది కూర కూడా వండుకుంటారు. అయితే అరటి పూల రసం పెరుగులో కలిపి తీసుకుంటే విరోచనాలు తగ్గిపోతాయి.
గులాబీ అంటే జడలో పెట్టుకోడానికి మాత్రమే పనికి వస్తుంది అనుకోవడం పొరపాటు. గులాబీ పూల రేకులను రసంలా చేసి దానిని రెండు పూటలా కనురెప్పల పైన అలానే కంటి కింద రాస్తే కంటి చలువ ఉండడమే కాక కంటి రోగాలు కూడా ఉండవు.
లవంగం పూలు భోజనం తర్వాత నోట్లో వేసుకుంటే నోట్లో నిల్వ ఉండే ఆహార పదార్ధాల నుంచి దుర్వాసన కలగకుండా సహాయ పడుతుంది.
ఈ తంగేడు పూలని నీళ్లలో నానబెట్టి మెత్తగా చూర్ణం చేసి దీనిని తీసుకుంటే కనుక అతి ఉష్ణం నుంచి చలువ చేస్తుంది.
మూఢ ఎర్ర మందారం పూలని కొబ్బరి నూనె లో వేసి కాచుకోవాలి. ఆ తర్వాత దానిని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కురులు నల్లబడటం మాత్రమే కాకుండా వెంట్రుకలు రాలడాన్ని కూడా నివారిస్తుంది. కురులు నల్లగా అవ్వడంతో పాటు సిల్కీగా కూడా అవుతాయి.
ఈ మల్లె పువ్వులు కంటికి చలవ చేస్తాయి వేడి నుంచి కళ్ళు మండుతున్నట్టు అనిపిస్తే దీనిని రెప్పలపై రాయడం వల్ల వేడి లాగేస్తుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments