రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. కానీ ఈ సంవత్సరం రంజాన్ మాసంలో కరోనా వచ్చింది కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక దూరం తప్పనిసరి కనుక మసీదు కి వెళ్ళడం కంటే ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవడం ఉత్తమం. ఇఫ్తార్ విందులు కూడా ఇంట్లోనే జరుపుకోవాలి. ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు వైద్యుల సూచనలు తీసుకోవడం తప్పనిసరి.
శరీర గ్లూకోజ్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు, మధుమేహ వ్యాధి ఉన్నవారు, గర్భిణులు ఉపవాసం ఉండకపోవడం మేలు. లాక్ డౌన్ ముగిసే వరకూ అత్యవసర మందులు దగ్గర ఉండాలి లేకపోతే ఆన్ లైన్ లో మెడిసిన్స్ పై ఆధారపడాలి.
ఉపవాస సమయం ముందు, ముగిసిన తర్వాత నీళ్ళు తాగాలి. బిర్యానీ, హలీం ఎక్కువగా తీసుకోకూడదు. కొవ్వు అథికంగా ఉన్న పదార్థాలు, పండ్ల రసాలు, మామిడి పండ్లు మరియు ఖర్జూరాలు తీసుకోకూడదు. తృణధాన్యాలు, గోదుములతో తయారు చేసిన రొట్టెలు తినవచ్చు. వెన్న తీసిన పాలు తాగాలి.
ఉపవాసం లేనప్పుడు ఇంట్లోనే వ్యాయామం చేయడం ప్రయోజనం. ఉపవాసం వల్ల గ్లూకోజ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి గ్లూకోజ్ మీటర్ దగ్గర ఉంచుకోవాలి.కాబట్టి ఇమ్యూనిటీ తగ్గిపోకుండా, ఆరోగ్యం కోల్పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. అప్పుడు ఆరోగ్యం కూడా మెరుగుగా ఉంటుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments