దబ్బ కాయ మనిషికి చాలా ఆరోగ్యం ఇస్తుంది. పూర్వం సముద్ర ప్రయాణం లో తలెత్తే వికారానికి శ్వాస కోశ వ్యాధులకు సమస్యలకి దబ్బకాయ మందులా పని చేస్తుంది. అలానే దీని రసాన్ని విష ప్రయోగానికి విరుగుడు గాను వాడేవారు.
సి విటమిన్ కాల్షియం ఐరన్ బీటా కెరోటిన్ మెగ్నీషియం సెలీనియం విటమిన్ బి6 వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. డయేరియా డీసెంట్రీ లకు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి ఇస్తారు. దబ్బకాయ తొక్కలో సిట్రల్ వంటి పదార్ధాలు ఉంటాయి.
దీని వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు హానికర వైరస్లు బ్యాక్టీరియాలు వంటివి కూడా పోరాడడానికి సహాయ పడతాయి. అంతే కాకుండా దబ్బ పండు రసం గుండెకు మంచి టానిక్లా పని చేస్తుంది. దీనిలో విటమిన్ సి పొటాషియం బీపీని నియంత్రిస్తాయి.
దబ్బ కాయ పండు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. అలానే దబ్బకాయ వాత పిత్త కఫ దోషాలను తగ్గిస్తుంది. తొక్కని ఎండబెట్టి దానిని చప్పరిస్తే కఫ వాత దోషాలు, నులి పురుగులు తగ్గుతాయి. దీనిలో బెల్లం కలిపి ఆ రసాన్ని తాగితే వేసవి తాపం తగ్గుతుంది. దబ్బకాయ దివ్యౌషధంలా పనిచేస్తుంది. దగ్గు జలుబు ఆస్తమా కూడా తొలగిపోతాయి
విటమిన్ సి తెల్ల రక్తకణాల సంఖ్య పెంచి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి విటమిన్ సి ఉండడం వల్ల ఇవి కూడా బాగా పని చేస్తుంది. అలసటను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది.
అలానే ఉదర సమస్యలకు పరమౌషధంలా పనిచేసే మాదీఫల రసాయనం ఈ దబ్బకాయ తోనే తయారు చేస్తారు. ఇతర సిట్రస్ పండ్లతో పోలిస్తే గుజ్జు కన్నా తెల్లని పీచు భాగం ఇందులో ఎక్కువ ఉండటం వల్ల దీనికి ప్రత్యేకత మరింత ఉంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments