జుట్టు ఊడిపోవడం, తెల్లవెంట్రుకలు తో బాధ పడుతున్నారా...? అయితే ఈ ఆహార నియమాలను పాటించండి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు ఎంతో అవసరం కాబట్టి ఎక్కువ మోతాదు లో ప్రొటీన్లు తీసుకోవాలి. పాలు, పెరుగు, ధాన్యాలు వంటివి తీసుకోవడం తో పాటు చికెన్, చేప, గుడ్లు కూడా తీసుకోవడం మంచిది.
అయితే కేవలం ప్రొటీన్లు మాత్రమే కాకుండా ఐరన్ జింక్ సెలీనియం మొదలైన అంశాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే వీటితో పాటు డ్రైఫ్రూట్స్ కూడా తీసుకోవడం మేలు చేస్తాయి. బాదం పిస్తా వాల్ నట్స్ వంటివి డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి.
అలానే మినుములు, అవిసె గింజలు వంటివి కూడా తీసుకోవడం మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఇటువంటి ఆహారం వల్ల బాగా ఉంటాయి. అలాగే శరీరం లో విటమిన్-డి తక్కువగా ఉన్నా సరే జుట్టు రాలుతుంది. విటమిన్-డి తక్కువ ఉంటే డాక్టర్ ని ఒకసారి సంప్రదించడం మంచిది. లేక పోతే ఎండలో ఉంటే విటమిన్-డి పొందుతారు.
నిద్ర పోయే ముందు రెండు గంటల ముందుగా ఆహారం తీసుకోవడం మంచిది. అలానే నిద్రలేమి కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. అలానే నిద్రపోయే గంట ముందు ఫోన్ టీవీ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపేయడం మంచిది. అలానే ఏడు గంటలపాటు చక్కగా నిద్రపోవాలి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments