ఇలాంటి క్రిటికల్ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి , వైరస్ సోకకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ప్రభావం ఎక్కువ .
చాలా మంది ఉదయం లేవగానే కాఫీ తో వారి రోజున మొదలు పెడతారు. కానీ దీనిని మార్చుకొని టీ తాగడం వల్ల ప్రయోజనం ఉంది , ఎందుకంటే కాఫీ లో డీహైడ్రేషన్ కు గురి చేసే గుణం ఉంది. అయితే ఎలాంటి టీ? అల్లం టీ తాగడం ఎంతో అవసరం ఎందుకంటే అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి గొంతుకు రక్షణ ఇస్తాయి. కానీ కొంతమందికి అల్లం రుచి నచ్చదు అలాంటప్పుడు తులసి మరియు దాల్చిన చెక్క తో చేసుకొని త్రాగవచ్చు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పొట్టు తీయని ధాన్యాలు వాడడం అవసరం. ఒక వేళ ఇడ్లీ , దోశ వంటి బ్రేక్ఫాస్ట్ చేస్తే తాజాగా ఉన్న పిండి తోనే తయారు చేసుకోవాలి. లేకపోతే శరీరంలోకి బ్యాక్టీరియా చేరుతుంది. అదే పూరి, చపాతీ చేసుకుంటే వాటితో పాటు తాజా కూరగాయలు ఉడికించి తినవచ్చు.
తినే అన్నం యొక్క బియ్యం పొట్టు తీయకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ముడి బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదే చపాతి అయితే పొట్టు తీయని గోధుమలు వాడాలి . ఒకవేళ మాంసాహారం వండితే అధిక ఉష్ణోగ్రతలో ఉండేటట్టు వండాలి ఇలా చేస్తేనే బ్యాక్టీరియా వంటివి చచ్చిపోతాయి. శాకాహారులైతే ఆకుకూరలు , తాజా కూరగాయలు తక్కువ నూనెతో వండడం అవసరం. వీలైనంత వరకూ ఫ్రై లు చేయడం మానేయాలి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments