రోజూ మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి ఇలా చెయ్యడం వల్ల శరీరం లో వేడి తగ్గి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. రోజూ తినే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తింటే జుట్టు బలంగా తయారవుతుంది. తలస్నానం కుంకుడుకాయ, షీకాయ, ఉసిరి, మెంతులు, కలబంద, వేప, మందార వంటి సహజ ఉత్పత్తులుతో చేయాలి. అలానే అథిక శాతం కెమికల్స్ ఉన్న షాంపూలు వాడితే కూడా జుట్టు పై ఆ ప్రభావం పడుతుంది. అందు వల్ల జుట్టు వేగంగా ఊడిపోతుంది.
వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. ఇలా చెయ్యడం వల్ల ఎప్పటికి అపుడు జుట్టు శుభ్రంగా ఉంటుంది. షాంపూలో సువాసన కోసం వివిధ పథార్థాలు కలుపుతారు, అటువంటి నూనె, షాంపూ కూడా వాడకూడదు.
తలస్నానానికి ముందు కలబంద, ఆముదం, మెంతి పొడి,పెరుగు,ఉల్లి రసం, మందారాకు రసం, ఇలా ప్రతిసారి ఒకో పదార్థం తలకు రాయడంతో చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. నూనె రాసుకునే ముందు కొంచెం వేడి చేసి రాసుకుంటే తలపోటు కూడా తగ్గుతుంది.
కరివేపాకు తింటే కూడా జుట్టుకి మంచి ఫలితం వస్తుంది. దాని వల్ల జుట్టుకి మంచి రంగుతో పాటూ ఒత్తుగా, దృడంగా ఎదిగి కుదుళ్ళు బాగా తయారవుతాయి. ఇలా చెయ్యడం వల్ల జుట్టు ఎంతో అందంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు ఈ పధార్ధాలని ఉపయోగించేసి మీ జుట్టుని కాపాడుకోండి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments