సహజంగా ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం మంచిది అని చెప్తూ ఉంటారు పెద్దలు. తోటకూర పాలకూర, చుక్కకూర, గోంగూర ఎలా ఎన్నో ఆకు కూరలు తరచు తీసుకుంటేనే ఉంటాం. అయితే గోంగూర తో పప్పు పులుసు పచ్చడి ఇటువంటివి చేసుకుంటూ ఉంటాం. అయితే ఆరోగ్యం గోంగూర తో ఎలా మెరుగు పడుతుంది. నిజంగా ఆరోగ్యపరంగా గోంగూర శ్రేష్టమైన దేనా...? దానిలో ఉన్న లాభాలు ఏమిటి? ఆలస్యమెందుకు చూసేయండి...
గోంగూర నిజంగా ఆరోగ్యపరంగా ఎంతో శ్రేష్టమైనది. గోంగూర లో ఉండే పీచు పదార్థం మన గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇలా గోంగూర నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిది. గోంగూర శరీరంలో ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది. గోంగూర ఆకులో ఉండే పొటాషియం ఖనిజ లవణాలు రక్త ప్రసరణ సక్రమంగా ఉండేటట్లు చూసుకుంటుంది. అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి గోంగూర సహాయపడుతుంది.
గోంగూర లో విటమిన్-ఎ అధికంగా ఉండటం వల్ల మన కంటికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. గోంగూరలో విటమిన్-సి బి6 కూడా ఉన్నాయి. మెగ్నీషియం పొటాషియం కూడా పుష్కలంగా ఉన్నాయి, గుండె కిడ్నీ వ్యాధులు నివారించడానికి గోంగూర సహాయ పడుతుంది
గోంగూర లో క్యాల్షియం ఇనుము సమృద్ధిగా ఉంటాయి కాబట్టి రోజు వారి ఆహారంలో గోంగూర ఉండేలా చూసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా పటిష్టంగా ఉంటాయి. అలానే ఒంట్లో ఇన్సులిన్ స్థాయిని పెంచడానికి షుగర్ లెవల్స్ తగ్గించడానికి కూడా గోంగూర మెరుగుగా పనిచేస్తుంది. అలానే గోంగూర యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది.
దగ్గు ఆయాసం తుమ్ముల తో ఇబ్బంది పడే వాళ్లు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఫాలిక్ యాసిడ్ మరియు మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments