అల్లం నిజంగా ఒంటికి ఎంతో మంచి చేస్తుంది. దీని యొక్క విశేషత ఈనాటిది మాత్రమే కాదు. పూర్వం నుంచి మన ఆయుర్వేద పండితులు అల్లం లోని ఔషధ గుణాలను మనకి చెబుతూనే వస్తున్నారు. అయితే అల్లం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి? దీని వల్ల మనకి ఏమి లాభం? నిజంగా అల్లాన్ని వాడితే ప్రయోజనాలు మనకి ఉంటాయా? అన్న ప్రశ్నలు మీలో ఉన్నాయా? అయితే తప్పక దీనిని చదివేయండి....
అయితే అల్లం వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ఉపకరిస్తుంది. సైంధవ లవణం, అల్లం నూరి అందులో కాస్త నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. ముందు ప్రయోజనం ఏమిటంటే విష దోషాలు తొలగిపోతాయి. అంతే కాక అన్నం హితవు కలుగుతుంది. అలానే అజీర్తి వంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.
సహజంగా మనం ఉసిరికాయ తొక్కు పచ్చడి చేసుకుంటూనే ఉంటాం. అయితే ఆ ఉసిరి తొక్కు పచ్చడి లో కొంచెం అల్లం ముద్ద కలిపి ప్రతి రోజూ తింటే వివిధ జబ్బుల నుంచి కానీ వైరస్ నుండి కానీ తట్టుకునే శక్తి మనకి లభిస్తుంది. కేవలం ఒక్క రకం కాకుండా అల్లం తో వివిధ రకాల ను కూడా చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కలిపి రోజుకి రెండుసార్లు టీ లాగ తీసుకోవచ్చు.
ఇది నిజంగా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల పేగులు కూడా శుభ్రం అవుతాయి. వైరస్ బారిన పడిన బాధితులు సాధారణ ఆరోగ్య వంతులు తీసుకో దగ్గది ఈ అల్లం. వనమూలికలతో కాచే టీ లో పంచదార బదులు బెల్లం కూడా కలుపుకోవాలి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments