సొర కాయ శరీరానికి చాలా మంచిది దీనిలో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి. పండ్ల లో కన్నా నీళ్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా సొరకాయను వాడడం మంచిది. అయితే దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి...? దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా...? మరి ఆలస్యం ఎందుకండీ చదివేయండి...
సొరకాయ లో పీచు ఉండడం వల్ల మలబద్దకాన్ని ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. సొరకాయ రసం అసిడిటీని తగ్గిస్తుంది. సొరకాయ లో విటమిన్ సి, బి, కె, ఈ అలానే ఐరన్ పొటాషియం మాంగనీస్ వంటి పదార్ధాలు కూడా ఇందులో ఉన్నాయి. దీని వల్ల శరీరం లో మెటబోలిక్ చర్యలు నివారించడానికి సహాయ పడుతుంది.
అంతే కాదు సొరకాయ వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. జీర్ణాశయ సమస్యలకు దూరం చేస్తుంది. అధిక బరువును తగ్గించుకోడానికి సొరకాయ చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఎండా కాలం లో చెమట ద్వారా నీరు ఎక్కువగా పోతుంది. కాబట్టి సొరకాయ తినడం వల్ల ఆ నష్టం భర్తీ చేస్తుంది.
హృదయ సంబంధమైన రోగాలకు, ముక్కు వెంబడి రక్తం కారడం, మొటిమలు అల్సర్ వంటి వాటిని కూడా నయం చేయడం లో సొరకాయ బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అధిక సోడియం నష్టాన్ని నివారించే త్వరగా అలసిపోకుండా చేయడానికి సహాయపడుతుంది.
సొరకాయ లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీనిని తరచుగా తీసుకోండి. ఇది అన్ని కాలాల్లో కూడా అందుబాటు లో ఉంటుంది కాబట్టి సులువుగా దొరుకుతుంది. మరి ఆలస్యం ఎందుకు సొరకాయ తో పులుసు, కూర, పప్పు ఇలా మీకు నచ్చినట్టు చేసుకోండి అనారోగ్య సమస్యల నుంచి బయట పడండి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments