ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా మంచిది. అయితే నల్ల వెల్లుల్లి ఇంకా మంచిదట. నల్ల వెల్లుల్లి ఎక్కడా ప్రత్యేకంగా పండదు. దీనిని ఒక పద్దతి లో నిల్వ చేయడం లేదా అధిక ఉష్ణోగ్రత కి గురి చేయకుండా నల్లగా మార్చి దీనిని తయారు చేస్తారు.
అయితే ఇలా చేసిన వెల్లుల్లి మామూలు వెల్లుల్లి లా ఉండదు. ఇది తియ్యగా జెల్లీలా సాగుతుంది. మామూలుగా వెల్లుల్లి లో ఘాటు వాసన కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ నల్ల వెల్లుల్లి లో ఇలా ఉండవు.
ఈ వాసన ఘాటుగా కూడా మరింత తగ్గి పోతాయి కానీ పోషకాలు మాత్రం ఏ మాత్రం తగ్గవు. ఇలా చేయడం వల్ల ఆహారం లో రుచి కూడా పెరుగుతుంది.
ఈ పద్ధతి లో దీనిని చేయడం వల్ల దీని లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్, పీచు పదార్ధాలు ఐరన్, క్యాల్షియం, విటమిన్ సి కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. అందుకే జపాన్ థాయిలాండ్ దక్షిణ కొరియా లో ఈ నల్ల వెల్లుల్లి ఎక్కువగా వాడతారట.
అయితే దీని వల్ల కాలేయ పని తీరు బాగుంటుంది అంతే కాకుండా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కూడా తగ్గిపోతుంది. ఆహారం లో దీనిని తరచుగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి గుండె పని తీరు మెరుగ్గా పని చేస్తుంది.
మధుమేహం నుండి కూడా ఇది రక్షిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. సాలిడ్ సిస్టం అనే పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల కణాల్లో ఆక్సీ కరణ ఒత్తిడి ఏర్పడటం కూడా ఉంటాయి.
పాలీ ఫినాల్స్ కూడా ఐదు రెట్లు ఎక్కువ ఇందు లో ఉంటాయి. అంతే కాకుండా జ్ఞాపక శక్తి పెంచడానికి నాడీ వ్యవస్థ ని ప్రభావితం చేయడానికి కూడా ఇది బాగా సహాయ పడుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments