ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అయితే సహజంగా మనం ఏదో ఒకటి తింటే ఆరోగ్యంగా ఉంటారు కదా అని అనుకుంటారు. ఇలా అనుకోవడం మంచిది కాదు. చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులను అనుసరించడం ముఖ్యం.
మన పెద్దలు షడ్రసోపేతమైన భోజనము అని అంటారు, దాని వెనక అద్భుతమైన ఆరోగ్య రహస్యం దాగి ఉంది. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే బాలన్స్ డైట్. డైట్ అంతా కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. దీని వల్ల శరీరంలో ప్రతిదీ కూడా సరైన క్రమంలో మోతాదులో ఉంటాయి. దీని వల్ల నిజంగా ఆరోగ్యానికి చక్కని ప్రయోజనం ఉంటుంది.
మన జీవితం సాఫీగా, చక్కగా, ఆరోగ్యంగా సాగాలంటే మంచి భోజనం తీసుకోవాలి. భోజనంలో షడ్రుచులు కలిగి ఉండాలి. అంటే తీపి ,పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు అనే ఆరు రుచులు ప్రధానంగా ఉండాలి.
అయితే వగరు, చేదు ఈ రెండు రుచులు కలిగిన ఆహార పదార్థాలు తక్కువ గానే తింటాం. వైరల్ వ్యాధులకు తీపి అనుకూలంగా పని చేస్తుంది. అందుకని తక్కువగ తీపి , ఎక్కువగా వగరు తినడం మంచిది.
ఇలా ఆరు రుచులు ప్రతిరోజూ ఆహారంలో ఉండేటట్లు తీసుకోవాలి. అందుకనే ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు ప్రతి రోజు ఉగాది పచ్చడి తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. అన్ని కాలాల్లో కూడా ఇది రోగ నిరోధక శక్తి గా పనిచేస్తుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments