దేవుడు ఉన్నాడు! అని నిరూపించిన సైంటిస్ట్.. అదెలా?

img

అసలు దేవుడు ఉన్నాడా? దేవుని స్వభావం ఏమిటి? దేవుడు  ఎవరు? మనం ఆయనను కేవలం "విశ్వాసం" తో మాత్రమే నమ్మాలా? లేదా ఆయన ఉనికికి ఏదైనా రుజువు ఉందా? ఈ ప్రశ్నలు చరిత్రలో ఎన్నోసార్లు ఎంతోమంది లేవనెత్తారు. నేటి సమాజం లో కూడా ఈ ప్రశ్న చాలా మంది ప్రజల మనస్సులలో తలెత్తుతూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి వచ్చే ఈ  ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

అతి చిన్న అణువు నుండి అతిపెద్ద గెలాక్సీల వరకు చాలా అద్భుతంగా ఏర్పడ్డ ఈ సృష్టిలో మనం వేల సంవత్సరాలుగా జీవిస్తున్నాం. అసలు ఈ ప్రపంచం ఎలా ఉనికిలోకి వచ్చింది? కొంతమంది శాస్త్రవేత్తలు ఈ సృష్టిని వివరించడానికి “బిగ్ బ్యాంగ్” సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.. బిగ్ బ్యాంగ్ ద్వారా అనంత విశ్వం వ్యాకోచించి అనేక గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయని చెబుతారు.. 

ఈ సిద్ధాంతానికి సంబంధించి ఒక ఫన్నీ స్టోరీ మనుగడలో ఉంది. అదేంటంటే చరిత్రలో గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరైన "జేమ్స్ మ్యాక్స్ వెల్" కి దేవుని పై గట్టి నమ్మకం ఉండేది.. అతడి తోటి శాస్త్రవేత్త మరియు సన్నిహితుడు జేంస్ తో 

 "దేవుడు లేడు" అని తరచుగా వాదించేవాడు. ప్రపంచం స్వయంగా సృష్టించబడిందని ఆయన అభిప్రాయం. ఒక రోజు, జేంస్ "సౌర వ్యవస్థ" యొక్క నమూనాను తయారు చేసి, దానిని తన రిసెర్చ్ ల్యాబ్ లో ఉంచి తన పనిలో తాను మునిగిపోయాడు... ఎప్పటిలాగే తన స్నేహితుడు జేంస్ ని కలవడానికి వచ్చాడు.. అయితే అక్కడే ఉన్న ఆ సౌర వ్యవస్థ నమూనాను చూసి "ఇది అద్భుతంగా ఉంది, దీనిని ఎవరు తయారు చేశారు? ” అని ఆశక్తిగా జేంస్ ని అడిగాడు.. "ఎవరూ దీనిని తయారు చేయలేదు, నేను నా టేబుల్ మీద పని చేసుకుంటుండగా ఒక పెద్ద పేలుడు శబ్దం విన్నాను, ఎమిటా అని నేను తిరిగి చూసేసరికి ఇది నాకు కనబడింది.." అని బదులిచ్చాడు..  

"నువ్వు జోక్ చెయ్యకు, ఒక పేలుడు ద్వారా ఇది ఎలా సృష్టించబడుతుంది ? ఖచ్చితంగా ఎవరో ఒకరు దీన్ని తయారు చేసి ఉండాలి.. ” అని అన్నాడు .. అందుకు బదులుగా జేమ్స్ మాక్స్వెల్ ఇలా అన్నాడు.. “మిత్రమా, సౌర వ్యవస్థ యొక్క చిన్న నమూనాను స్వయంగా సృష్టించవచ్చని మీరు నమ్మడానికి ఇష్టపడడం లేదు.. అలాంటిది సౌర వ్యవస్థలతో కూడిన ఈ అనంతమైన విశ్వం కూడా ఒక "సృష్టికర్త" లేకుండా ఉనికిలోకి వచ్చిందని మీరు ఎలా నమ్ముతున్నారు? అని సూటిగా ప్రశ్నించాడు.. దీంతో జేంస్ యొక్క ఫ్రెండ్ ఖంగుతిన్నాడు.. 

"విశ్వం నమూనా" ను ఎవరైనా సృషిస్తేనే మనుగడలోకి వచ్చిందని ఎలా ఐతే నమ్ముతున్నామో, ఈ విశ్వం కూడా ఒక సృష్టికర్త ద్వారా స్రుష్టించబడింది అని మనం ఎందుకు నమ్మకూడదు? ”  అనేది దీని సారాంశం.. 

దీనికి మరొక ఆశక్తికర ఉదాహరణ తీసుకుంటే..

ఒక సైన్స్ టీచర్ తన విద్యార్థులకు "ప్రపంచం స్వయంగా సృష్టించబడింది" అని నేర్పించింది. ఆ తర్వాత ఆ విద్యార్థులను తమ హోం వర్క్ లో భాగంగా ప్రపంచ పటాన్ని తయారు చేసి మరుసటి రోజు తీసుకురావాలని ఆమె కోరారు.

ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పిన దానితో మనసులో విభేదించాడు. ఆ విధ్యార్ధి ఆ టీచర్ ని ఆటపట్టించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు, అతను కాగితపు షీట్ మీద కొన్ని పదాలు రాసి, తనకు తోచిన రంగులతో నింపాడు. అతను తన షీట్ ను ఇతర విద్యార్థులు టీచర్ కు అందజేసిన షీట్ల మధ్య ఉంచాడు. టీచర్ తరగతి గదికి వచ్చి విధ్యార్ధులు టేబుల్ పై ఉంచిన షీట్ లు చూడడం మొదలు పెట్టింది.. ఆమె అందులో ఒక కాగితపు స్క్రాప్ పై ఏవేవో పదాలు, రంగులు వేసి ఉండడం చూసి కోపం తెచ్చుకుంది... " ఈ పని ఎవరు చేసారు?" అని ప్రశ్నించింది. తరగతి మొత్తం మౌనంగా ఉంది. "ఎవరు చేశారో చెప్పండి, లేదంటే నేను అందరికీ శిక్ష విధిస్తాను.." అని ఆమె అనడంతో.. "టీచర్, నా అభిప్రాయం ప్రకారం ఎవరూ దానిని తయారు చేయలేదు.. పెన్సిల్ ఎగిరి ఒక షీట్ పై గీతలు రాసింది, రంగులు ఎగిరి కాగితాన్ని నింపాయి, ఆ కాగితం ఎగిరి వచ్చి మీ డెస్క్ మీద పడింది.." అని చెప్పాడు.

"అది ఎలా సాధ్యం? ఖచ్చితంగా ఎవరైనా దీన్ని తయారు చేసి ఉండాలి.. అంతే గాక నీవే దీనిని ఇక్కడ పెటావు అని నా అనుమానం.." అని టీచర్ అవేశంతో బదులిచ్చింది..

“టీచర్! భూమి యొక్క చిన్న పటం దానికదే తయారయ్యింది అని నమ్మడానికి మీరు ఇష్టపడడం లేదు.. మరి అసంఖ్యాక గ్రహాలతో, నక్షత్రాలతో కూడిన ఈ వాస్తవ ప్రపంచం దానికదే సృష్టించబడిందని మీరు ఎలా బోధిస్తున్నారు ?.. కాబట్టి దీనర్ధం ఈ విశ్వాన్ని ఎవరో స్రుష్టించారనే కదా ? అని అనడం తో క్లాస్ రూం అంతా కాసేపు నిశ్శబ్దం అలుముకుంటుంది.. 

ఈ రెండు ఉదాహరణలు చూసుకుంటే దేవుడే ఈ విశ్వాన్ని ఒక పద్దతి ప్రకారం శ్రుషించాడని అర్ధమవుతుంది.. అదే వ్ధంగా మనిషికి, ప్రక్రుతికి, వివిధ కాలాలకు ఒక అవినాభావ సంభందం ఏర్పరిచి జీవం పోశాడు అని అనిపిస్తుంది..

ఇంతకీ మీరైతే ఏం చెప్తారు? దేవుడు ఉన్నారన్నదానికి ఈ ఉదాహరణలు సరైనవేనా? లేక "దేవుడు ఉన్నాడు" అనడానికి ఇతర బలమైన ఉదాహరణలు ఏవైనా ఉన్నాయా? మీకు తెలిస్తే గనక కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.. ఒకవేళ "దేవుడు లేడు" అనే వారు అది నిరూపించడానికి మీ వద్ద ఉన్న ఉదాహరణలు కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయవచ్చు... మీ ఆరోగ్యకరమైన చర్చ ద్వారా కొంతమంది సందేహాలైనా నివ్రుత్తి కావాలని న్యూస్ 6జి ఆశిస్తోంది..  

మరిన్ని

Comments

0 Comments

భక్తి

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()