తిరుపతిలో జరిగే పూజాదికాలకు
కూర్పునిచ్చారు
సర్వజనులకూ మంత్రోపదేశం చేశారు
భగవత్ రామానుజుల జీవిత చరిత్ర
పదిమందికి మంచి జరిగేదైతే... ఒకరికి కీడు కలిగినా పరవాలేదు. అష్టాక్షరితో అందరికీ మోక్షం లభిస్తుందనుకుంటే, నేను నరకానికి వెళ్లినా మంచిదే.
అందరిపట్లా మానవత్వం పరిమళింపచేయడమే భగవత్ తత్వం. ఆచార వ్యవహారాలు సమాజ శ్రేయస్సుకే ఉపయోగపడాలి అని చాటి చెప్పారు శ్రీమద్ రామానుజాచార్యులు. లోకశ్రేయస్సు కాంక్షించి అందరికీ అష్టాక్టరి అందించిన ఆ మహనీయుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం....
రామానుజులు చెన్నై సమీపంలోని శ్రీపెరుంబుదూర్ గ్రామంలో 1017 సంవత్సరంలో జన్మించారు. తండ్రి కేశవ సోమయాజి. తల్లి కాంతిమతీ దేవి. రామానుజులకు లక్ష్మణస్వామి అనే పేరు కూడా ఉండేది. ఆయన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. మేనమామ అయిన తిరుమల నంబి సహకారంతో విద్యాభ్యాసం చేశారు. శాస్రాధ్యయనం చేయటం కోసం కాంచీపురంలోని యాదవ ప్రకాశులనే అద్వైత సిద్ధాంతి గురుకులంలో విద్యార్థిగా చేరారు. రామానుజుల ప్రతిభ అందరి ప్రశంసలను పొందింది.
ఒకసారి రామానుజులకు కొన్ని ఉపనిషద్వాక్యాలకు అర్థం చెప్పే సందర్భంలో గురువుగారితో భేదాభిప్రాయం కలిగింది. ‘కప్యాసం పుండరీకమేవ మక్షిణి’ అన్న వాక్యానికి అర్థం చెబుతూ యాదవ ప్రకాశులు.... ‘కోతి పృష్ఠం వలె ఎర్రనైన రెండు కన్నులు కలవాడు భగవంతుడు’ అని అర్థం చెప్పారు. రామానుజులుకు ఈ అర్థం సరైనది అని అనిపించలేదు. దీంతో... భగవంతుని నేత్రములకు ఇంత నీచమైన ఉపమానం చెప్పటం సరైనది కాదని గురువుగారికి చెప్పారు. దీంతో రామానుజులు...‘కం పిబతీతి కపిః’ అని... కపి అనగా సూర్యుడని... సూర్యుని కిరణ స్పర్శ చేత వికసించిన తామరల వంటి నేత్రములు కలవాడు అని వారు రామానుజులు సమాధానం చెప్పారు. వెంటనే యాదవ ప్రకాశులకు రామానుజుల మీద కోపం వచ్చిందిట. అందుకే ఆయన రామానుజులను తుదముట్టించాలని ప్రయత్నం చేశారట... కాశీయాత్ర నెపంతో కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆయన్ను వదిలివేశాస్తారు. ఆ సమయంలో కోయ దంపతుల రూపంలో కంచి వరదరాజస్వామి, ఆయన దేవేరి పెరుందేవి అమ్మవారు... రామానుజులును తిరిగి కంచిదాకా తీసుకుని వచ్చారని ఒక కథనం ప్రచారంలో ఉంది.
తరువాతి కాలంలో... కాంచీనగరంలో ఉంటున్న కాంచీపూర్ణులును ఆశ్రయించి సంప్రదాయ రహస్యాలను తెలుసుకొమ్మని రామానుజులును అతని తల్లి ఆదేశించటంతో వారిని గురువుగా రామానుజులు స్వీకరించారు. రామానుజులు.... వరదరాజస్వామికి అభిషేకానికి జలాన్ని అందిస్తూ ఉన్న రోజుల్లో అక్కడికి యామునాచార్యులు వస్తారు. ఆయనకు రామానుజులలో వారికి భావి వైష్ణవ ధర్మ ప్రతిష్ఠాపకులు కనిపిస్తారు. యామునాచార్యులు శ్రీరంగం చేరుకున్న తరువాత రామానుజులను తీసుకుని రమ్మని తమ శిష్యులలో ఒకరైన మహానంబిని పంపిస్తారు. అయితే రామానుజులు శ్రీరంగానికి చేరేసరికి యామునులు దేహత్యాగం చేశారు. వారి చివరి కోరికను గూర్చి వారి శిష్యబృందం రామానుజులకు తెలియజేసింది. బ్రహ్మసూత్రాలకు బోధాయన వృత్తిని అనుసరించి భాష్యం నిర్మించటం, విష్ణుపురాణాన్ని అనుగ్రహించిన పరాశరులకు కృతజ్ఞతగా వారికి గౌరవ స్థానాన్ని కల్పించటం, శ్రీశఠగోపుల తిరువాయి మొజి ప్రబంధాన్ని దాని తాత్పర్యాన్ని సామాన్య ప్రజల్లో పరివ్యాప్తం చేయటం... మొదలైవాటి గురించి వారు రామానుజులకు తెలిపారు.
రామానుజులు ఈ ప్రతిజ్ఞలను పూర్తి చేయటం కోసం పలువరు గురువులను ఆశ్రయించి సాధన చేయవలసి వచ్చింది. ఒకరి దగ్గర పంచసంస్కారాలను ఇంకొకరి దగ్గర రామాయణ రహస్యాలను, మరొకరి దగ్గర భగవద్విషయాన్ని, మరొకరి దగ్గర గీతాసారాన్ని అధ్యయనం చేశారు. పంచసంస్కారాలు పొందే సందర్భంలో మహాపూర్ణులనే గురువు సులభంగా వారికి ఆ సంస్కారాలను ప్రసాదించలేదు. పద్ధెనిమిదిసార్లు వేడుకోగా రామానుజుల దృఢ నిశ్చయాన్ని గ్రహించి వారికి మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రోపదేశం చేసిన సందర్భంలో... ఇది మోక్ష ప్రదాయకమైన మహా మంత్రం... సామాన్యులెవరికీ ఉపదేశించరాదు... అలాచేస్తే ఇది దురుపయోగం అవుతుంది. నా మాట తప్పి నువ్వు ఇతరులకు ఉపదేశిస్తే నీకు నరకం వస్తుంది’ అని చెప్పారు. అయితే రామానుజులు సర్వజీవులకు మోక్షం కలిగించే ఆ మంత్రాన్ని అందరికీ ఉపదేశించాలని భావించారు. ఈ ప్రయత్నంలో గురువుల ఆజ్ఞను తిరస్కరించినందులకు తనకు నరకం ఎదురైనా పరవాలేదని భావించారు. ఆ నిశ్చయంతోనే గోపురం ఎక్కి అందరినీ దగ్గరకు రమ్మని పిలిచి మోక్షమిచ్చే ఈ మంత్రాన్ని మీరు స్వీకరించండి అంటూ ఆ గుప్త రహస్య విద్యను ఉపదేశించారు. తరువాత గురువులకు కోపం వచ్చి.... ఎందుకు తమ ఆజ్ఞను మీరావని అడిగారు. అందుకు రామానుజుల వారు... అయ్యా ఇన్ని వేలమందికి ఈ మంత్రోపదేశం మోక్షం కలిగించింది... మీ ఆజ్ఞను తిరస్కరించినందువల్ల నా ఒక్కరికి నరకం వస్తే నష్టమేమీలేదు అన్నారు. ఈ సమాధానినికి మెచ్చిన రామానుజులను మహాపూర్ణులు ప్రశంసించారు.
తరువాతి కాలంలో రామానుజులు శ్రీరంగంలో యామునుల తరువాత వైష్ణవ పీఠాన్ని అధిష్ఠించారు. అనేక రచనలు కొనసాగించారు. బ్రహ్మసూత్రభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపం, వేదార్థ సంగ్రహం, గీతాభాష్యం, గద్యత్రయం, నిత్య గ్రంథం రచించారు. ఈ గ్రంథాలలో ఉపనిషత్ భాష్యం కనిపించకపోయినా వారి వేదార్థ సంగ్రహం అనేక ఆధికారిక ఉపనిషత్తులను ఉరహరిస్తూ సిద్ధాంతాన్ని స్థాపించేట్టుగా ఉంటుంది. భగవత్ రామానుజులు గ్రంథ రచన చేస్తూనే భారత దేశమంతటా పర్యటించారు. రామానుజులు తమ సిద్ధాంత వ్యాప్తికి మూడు స్థాయిల్లో సంస్కరణలు ప్రవేశపెట్టారు. శ్రీరంగం, తిరుపతి, కంచి క్షేత్రాలలో అర్చనలు, ఉత్సవాలు, సేవలు ఎలా జరగాలో నిర్ణయం చేశారు. కోయిల్ ఒళుగు అనే గ్రంథం శ్రీరంగంలో జరిగే ఉత్సవాలను తెలియజేస్తుంది. ఈనాటికీ దాని ప్రకారమే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి
రామానుజులు 70 వయసులో ఉండగా తమిళదేశాన్ని కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్నాడు. ఆయన శైవమతాన్ని తప్ప మరొకటి అంగీకరించేవాడు కాడు. శైవమతం అంగీకరించని వారిని ఆయన పలురకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. ఒకసారి రామానుజులను ఆయన పిలిపించగా కూరేశుడు, పెరియనంబి కాషాయ వస్త్రాలు ధరించి... రామానుజుల వారి వేషధాణతో అక్కడికి చేరుకున్నారు. ఈ ఇద్దరూ రాజు ఆజ్ఞను అంగీకరించక తిరస్కరించారు. రాజు వారి కళ్లను పెకిలించబోగా వారే తమ చేతి గోళ్లతో తమ కళ్లను పెకిలించుకున్నారట. ఈ ఉపద్రవ పరిస్థితుల్లో రామానుజులు మైసూరు వెళ్లారు. అక్కడ రాజుని వైష్ణవుడిగా మార్చి అనేక దేవాలయాలను నిర్మించారు. కుళోత్తుంగ చోళుడి రాజ్య పరిపాలన ముగిసి తమిళనాడులో శాంతి నెలకొన్న సందర్భంలో శ్రీరంగంలోని భక్తులు రామానుజులను తిరిగి రమ్మని వేడుకున్నారు. అప్పటికి ఆయన వయసు 90 సంవత్సరాలు దాటింది. అయితే మేల్కోటేలోని రామానుజుల భక్తులు ఇందుకు అంగీకరించలేదు. అప్పుడు రామానుజులు స్వయంగా ఒక దేవాలయం నిర్మించి తమ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఇది అక్కడి భక్తులకు అది చాలా తృప్తి కలిగించింది. తరువాత రామానుజుల వారు శ్రీరంగం చేరుకున్నారు. 30 సంవత్సరాలు శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని, విశిష్టాద్వైత తత్త్వాన్ని నిరంతరంగా వ్యాపింపజేయటానికి అష్టదిగ్గజాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. డెబ్భైనలుగురు సింహాసనాధీశులను ఏర్పాటు చేశారు. ఏడు వందలమంది ఏకాంగీ యతులతో ప్రచారానికి ఒక వ్యవస్థ ఏర్పరిచారు. రామానుజులు 120 సంవత్సరములు ఈ భూమి మీద చరించారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments