ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది అని తెలుస్తుంది. వరుసగా భారీ నోటిఫికేషన్లు విడుదల చేస్తూన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందు అడుగు వేయనుంది అని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్) విభాగాల్లో మొత్తం 15 వేల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిలో పోలీసు శాఖలోని సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 11 వేల పోస్టులున్నాయ అని తెలుస్తుంది.
అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్‌మెన్, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్, వార్డెన్, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు సంబంధించి మరో 4 వేల పోస్టులున్నాయి. ఈ ఖాళీలను ప్రభుత్వం తక్షణం భర్తీ చేయటకు సంసిద్ధంగా వుంది. భాగాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఉద్యోగాల భర్తీ కోసం ఏటా ప్రభుత్వం విడుదల చేయనున్న క్యాలెండర్‌లో వీటికి కూడా చోటు కల్పించి, ఖాళీలను భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.
మొదట ఎన్ని పోస్టులో భర్తీ చేస్తారో అన్నదానిపై ఈ నెల చివరన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉండనుంది .
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments