నైరుతి రుతుపవనాల తో రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం లో అల్పపీడనం బలపడటం తో శుక్ర శనివారాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది.
అయితే నైరుతి ఋతు పవనాలు రాయలసీమ కోస్తాంధ్ర మొత్తం విస్తరించాయని చెప్పింది. అయితే దీని కారణం తో బుధవారం నుంచి అనేక ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే అతి భారీగా వానలు కురుస్తాయి అని అన్నారు.
ప్రకాశం జిల్లా లో వాగు ఉప్పొంగడం తో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. రానున్న 36 గంటల్లో తెలంగాణకు నైరుతి విస్తరిస్తుంది అని పేర్కొంది. నైరుతి రుతుపవనాల తో రాష్ట్రం లో వాతావరణం చల్లబడింది.
దీంతో రెండు రోజులుగా వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి. అలానే వాయువ్య బంగాళాఖాతం లో అల్పపీడనం కొన సాగుతోంది. సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది.
ఇక పోతే ఉత్తరాంధ్ర లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయి అని చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. అలాగే శ్రీకాకుళం జిల్లా లో పలు చోట్ల ఈదురు గాలులు వీచాయి.
భామిని మండలం దిమ్మిడి జోల లో పిడుగులు పెద్ద ఎత్తున పడ్డాయి. అలాగే విజయనగరం జిల్లా లో విజయనగరం, నెల్లిమర్ల, పూసపాటిరేగ , డెంకాడ, గంట్యాడ మండలం లో భారీ వర్షాలు కురిశాయి.
గుంటూరు జిల్లా లో మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి ప్రకాశం జిల్లాలో మాత్రం వర్షం ధాటికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments