రోజు రోజుకి ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంటే బాధపడాలో ఆనంద పడాలో తెలియడం లేదు. అభివృద్ధి చెందే కొద్దీ ప్రజలు చాలా చిన్న కారణాల తో మరణిస్తున్నారు. ఇది నిజంగా ఘోరమని చెప్పాలి.
అయితే ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం అలాగే గేమింగ్ లాంటివి బాగా అభివృద్ధి చెందడం అలానే గేమ్స్ వంటి వాటికి బానిసై పోవడం మృత్యువుకు కూడా దారి తీస్తోంది. చెప్పాలంటే ఈ కాలం నిజంగా దుస్థితిలా అయిపోయి దుఃఖాలను అందిస్తోంది.
అయితే తాజాగా ఒక ఘటన చోటుచేసుకుంది నిజంగా ఈ విషయం చాలా దారుణంగా ఉన్నదనే చెప్పాలి. అయితే పబ్ జి గేమ్ కు బానిసై ఒక యువకుడు మతి స్థిమితం కోల్పోయాడు. నిజంగా ఈ పబ్జి ఎందరో మందిని కట్టిపడేస్తుంది.
ఈ గేమ్ వ్యసనంలా మారిపోయింది చిన్నారులు సైతం యువకులు కూడా ఈ ఆటకి బానిసలవుతున్నారు. ఉదయం సాయంత్రం అనే సమయం తెలియకుండా ఈ ఆటలో మునిగి తేలుతున్నారు.
ఆన్లైన్లో స్నేహితుల తో కలిసి గేమ్ని ఆడుతున్నారు. ఇప్పుడు సెలవుల కారణంగా ఈ పబ్జి లాంటి గేమ్స్ కి మరింత దగ్గరవుతారు పిల్లలు. అయితే అరకులోయ మండల కేంద్రానికి చెందిన కౌశిక్ నిత్యం ఈ ఆట లో ఆడుతూ నిమగ్నమైపోయాడు. దీనితో ఒక్క సారిగా బిగ్గరగా అరవడం పిచ్చి గా ప్రవర్తించడం చేస్తుండేవాడు.
ఇవి గమనించిన కౌశిక్ కుటుంబ సభ్యులు తనని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత కౌశిక్ ని విశాఖపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు.
దీంతో వాళ్లు విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పబ్ జి గేమ్ కు బానిస కావడం తోనే కౌశిక్ మతి స్థిమితం కోల్పోయాడని వాళ్ళు చెప్పారు.
నిజంగా ఇది ప్రమాదంలా మారిపోయింది ఒక గేమ్ మనిషి మతిస్థిమితం కి పోవడానికి దారి తీసింది. ఎంత బాధాకరమో కదా..
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments