ఒక పక్క కరోనా వైరస్ పీడిస్తుంటే మరోవైపు ఈ తుఫాన్ అంటే అసలు ఏమవుతుంది? దీనివల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు చోటు చేసుకున్నాయి. అయితే వాతావరణం కనుక ఇలానే ఉందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని అర్థమవుతుంది. రేపట నుండి వాతావరణంలో తీవ్రంగా మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఒకవైపు కరోనా అంటే మరోవైపు ఈ వర్షమా నిజంగా ప్రజల్ని పెడుస్తోంది. దీనంతటికి కారణం ఏమిటి? దీనికి బంగాళా ఖాతంలో ఏర్పడిన భారీ తుఫాను కారణమంటున్నారు వాతావరణ శాఖ. ఈ సీజన్లో ఏర్పడే తొలి తుఫాను ఇదే అట. ఈ తుఫాను ప్రభావం వల్ల కోస్తా ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్న టు వాళ్లు తెలియజేస్తున్నారు. దీనితో పాటు గాలులు కూడా ఎక్కువగా లభిస్తాయి.
ఏప్రిల్ నెల 28 29 30 తేదీల్లో వాతావరణం విభిన్నంగా మారిపోతుందని...అలానే వర్షాలు కూడా వరుసగా కురుస్తాయని తెలుపుతున్నారు. మే 1న అండమాన్ లో తుఫాను ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది తీర ప్రాంతాల్లో పూర్తిగా వానలు అధికంగా ఉంటాయని కూడా వాళ్లు పేర్కొన్నారు.
కోస్తా తీర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండవచ్చు అని వాతావరణ శాఖ చెప్పింది.
ప్రజలంతా కూడా తుఫాను ప్రభావంతో తట్టుకునేలా అప్రమత్తం కావాలని అధికారులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో శనివారం నాడు 42.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది. అలానే తెలంగాణలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. చిరుజల్లులు, ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయి అన్న సంగతి తెలిసినదే.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments