కరోనా కారణం వల్ల ఇప్పటికే చాలా నష్టం వచ్చింది. కానీ జీడిపప్పు కూడా నష్టం లో పడింది. గత ఏడాది కంటే జీడీ ధర బాగా తగ్గింది. అంతే కాకుండా నిల్వలు ఉండడం కూడా దారుణం అనే చెప్పాలి.
దీంతో జీడిపప్పు వ్యాపారులు ఆందోళన చెందారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యం లో జీడి పప్పు పరిశ్రమలకు కూడా సడలింపు ఇవ్వడంతో కార్మికులు ఉపాధి లభిస్తోంది. అయితే వాటి ఉత్పత్తులు మాత్రం గిరాకీ లేకపోవడం తో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే మొత్తం జాతీయ స్థాయిలోనే పలాస జీడిపప్పు ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ కరోనా ప్రభావంతో దీనికి గతేడాది కంటే ఈ ఏడాది ధర తగ్గిపోయింది. అయితే సాధారణంగా సంక్రాంతి తర్వాత జీడిపప్పు ధరలు బాగా పెరుగుతాయి.
కానీ మార్చి నుంచి మే నెల వరకు శుభకార్యాలు పండుగలు ఉత్సవాలు సందర్భంగా దేశం లోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
అయితే దీని వల్ల ధరలు కూడా అందుకు అనుగుణంగానే పెరుగుతూ వచ్చేవి కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ జీడిపప్పు మీద పడి వ్యాపారులు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. గత ఏడాది కిలో జీడిపప్పు నాణ్యతను బట్టి 700 నుంచి 750 వరకు ఉండేది.
కానీ ఇప్పుడు నెంబర్ వన్ పప్పు 650 కి తగ్గిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. అలానే కనీసం గిట్టుబాటు లేకుండా 80 కిలో జీడి పిక్కల బస్తా 15000 కావాలని కోరడంతో వ్యాపారులు గ్రామాల్లోకి వెళ్లడం లేదు.
ప్రస్తుతం పలాస మార్కెట్ లో 80 కేజీల జీడి పిక్కల బస్తా ఎనిమిది వేలు మాత్రమే ఉంది ధరలు ఎప్పుడు పెరుగుతాయని రైతులు వ్యాపారులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ధరలు మాత్రం బాగా పడిపోయాయి.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments