కరోనా వైరస్ కారణంగా అన్నీ వాయిదా పడుతున్నాయి. పనులు కూడా ఏమీ జరగట్లేదు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. దేవాలయాలు సైతం అన్నీ మూతపడ్డాయి. ఈ కరోనా మహమ్మారి తగ్గిపోతే అన్నీతిరిగి ప్రారంభించవచ్చు. ఎవరి పనులు వారు సక్రమంగా చేసి తీరాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. కాకపోతే కరోనా మహమ్మారి అందరితో చెలగాటమాడుతోంది.
అయితే ఇప్పుడు మే మూడు తర్వాత లాక్ డౌన్ ముగుస్తుందని అందరికి తెలిసిందే. కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ ఎదురు చూడక తప్పదు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇస్తామని ఈ అంశంపై వారు సమాచారం ఇస్తామని అన్నారు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అయితే బుధవారం రాత్రి శ్రీవారి ఏకాంత సేవ లో ఆయన పాల్గొన్నారట. శ్రీ వారి ఏకాంత సేవ లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు అనిల్ కుమార్ సింఘాల్.
మే తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు . సమావేశం నిర్వహించాక శ్రీవారి దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని వారు చర్చించి అధికారంగా ప్రకటిస్తామని కూడా తెలియజేశారు
తిరుమలలో మే 1 నుంచి 3వ తేదీన జరగాల్సిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు కూడా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరిణయోత్సవాలని చేయాలంటే కనీసం 70 మంది అవసరం కాబట్టి సామాజిక దూరం పాటించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది ఇలా చేయడం కష్టమని వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈ శార్వరి నామ సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఈ ఉత్సవాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి వైభవంగా భక్తుల అందరి సమక్షంలో నారాయణగిరి లో నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments