రోహిణి కార్తె అంటేనే భయంకరంగా ఉంటుంది సూర్యుడు ఉగ్రరూపం ఎత్తి ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే రోహిణి కార్తె అంటేనే రోళ్లు బద్దలై పోతాయని నానుడి ఉంది. ఇది అనేక సార్లు నిజమైంది. ఇప్పుడు మళ్లీ నిజమని నిరూపిస్తోంది. ఈ రోహిణి కార్తి ఎండ లో జాగ్రత్తలు తీసుకోవాలి.
లేకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ నాలుగు నెలలు ఎండాకాలం లో ఉగాది తర్వాత కొంచెం కొంచెంగా తాపం పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి ఎండలు విపరీతంగా అవుతాయి.
అయితే ఇప్పుడు ఎండా కాలంలో చివరి కార్తీ అయిన ఈ రోహిణి కార్తి లో మాత్రం ఎండలు విపరీతంగా ఉంటూ ఉంటాయి. దీని వల్ల అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది. మే నెల 25 సోమవారం నుంచి జూన్ 8 తేదీ వరకు పదిహేను రోజుల పాటు ఈ రోహిణి కార్తె ఉంటుంది.
దీనితో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటే మనం తీవ్ర ఉష్ణోగ్రతలు చూడవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎండ వేడి మాత్రం బాగా తీవ్రంగా ఉంది అనే చెప్పొచ్చు అలానే వాతావరణం లో కూడా మార్పులు సంభవించాయి
అయితే ఇటువంటి ఎండలు ఉన్నప్పుడు పశుపక్ష్యాదులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాయి కాబట్టి ఆరుబయట గింజలు వేయడం నీటిని పెట్టడం చేయండి. నల్ల రంగు ముదురు రంగు దుస్తులు వేసుకోకండి.
అలాగే చిన్న పిల్లలకు ఇంటి ఉష్ణోగ్రత తీవ్రత బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి అనేక మార్లు నీళ్లు తాగుతూ ఉండండి. నీటిని ఎక్కువగా మట్టికుండ లో ఉంచిన వాటిని తీసుకోవడం వల్ల నీళ్ళు చల్లగా ఉంటాయి.
మజ్జిగ పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు నిమ్మరసం రాగి జావ వంటివి తీసుకోవడం మంచిది. వేపుళ్ళు, వేడి పదార్థాలు, మసాలాలు ఎక్కువ ఆయిల్ ఉన్న పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments