విశాఖపట్నం లో భారీ గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం లోని ఎల్ జి పాలిమర్స్ లో గురువారం తెల్లవారు జామున గ్యాస్ లీక్ అయింది. అయితే ఇప్పుడు గ్యాస్ లీక్ ని అరికట్టేందుకు 9 మంది నిపుణుల బృందం ప్రయత్నం లో ఉన్నారు. ప్రజలు ఇప్పటికే సతమత మవుతున్నారు.
విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కె మీనా, డిసిపి ఉదయభాస్కర్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలానే లీకేజీని అరికట్టే సమయం లో పేలుడు లాంటివి సంభవించవచ్చు అనేది కేవలం పుకారు మాత్రమే అని ఆర్కె మీనా చెప్పారు.
అలానే ముందు జాగ్రత్తగా అక్కడ కిలో మీటర్ వరకు ఉన్న గ్రామాల ప్రజలని ఖాళీ చేయించనున్నారు. అలానే ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ఆమె తెలిపారు. పేలుడు లాంటి ఘటనలు ఉండవని అవన్నీ వట్టి పుకార్లే అని ఆమె చెప్పారు.
అలానే ఇప్పటికే ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 300 పైగా అస్వస్థతకి కు గురయ్యారు. ఈ నేపథ్యం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించడం తో పాటు బాధితులను పరామర్శించారు. చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు.
అంతే కాకుండా ఆ కంపెనీ నుంచి మరో ప్రాంతానికి తరలించడం లేదా అక్కడే పునః ప్రారంభం కావడం జరిగితే బాధితుల కుటుంబం లో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ కు అప్పగించారు. వెంటిలేటర్ ద్వారా వైద్య సహాయం పొందుతున్న వారికి పది లక్షలు ప్రకటించారు.
రెండు మూడు రోజుల పాటు చికిత్స అవసరమైన వారికి లక్ష రూపాయలు ప్రకటించారు. అలానే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటున్న వారికి 25 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వైయస్ జగన్ చెప్పారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments