కరోనా కారణంగా అన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా దాటికి అన్ని మూసివేశారు. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో సిక్కోలు వాసులు ఆర్త నాదాలు చేస్తున్నారు. అక్కడ ఉండలేక స్వగ్రామానికి తిరిగి వెళ్ళ లేక కుటుంబానికి దూరమై ఆకలి కేకలు పెడుతున్నారు.
అయితే వాళ్ళు వాళ్ళ బాధలు ని వాట్స్ అప్ ద్వారా వీడియోలు ఫోటోలు తీసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి వీలైనంత త్వరగా తెలుగువాళ్ళని రప్పించే ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా కరోనా వ్యాపించడం తో అక్కడ మొత్తం అన్ని బంద్ చేశారు. రవాణా సౌకర్యాన్ని పూర్తిగా నిలిపివేయడం తో అభర్డెన్ బజార్, జంగ్లీఘట్, డైరీఫారం, బృక్షబాద్, డిగిలిపూర్, కమ్మలబ్యాగ్, వండూరు, మాయబందర్, బాతుబస్తీ, గేరాచలం ఇలా అనేక ప్రాంతాల్లో రెండు వేల మందికి పైగా మత్స్యకారులు అలానే పర్యాటకులు కూడా చిక్కుకున్నారు
జిల్లాలో మందస, పలాస, వజ్రపు కొత్తూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, రణస్థలం మండలాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. అయితే తిరిగి రావడానికి రవాణా లేక తినడానికి తిండి లేక ఫిషింగ్ చేసే బోట్ల పై పడుకుని కాలం గడుపుతున్నారు.
రెండు నెలల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఆకలి తో అలమటిస్తూ కంటతడి పెట్టుకున్నారు అయితే ఈనెల 25 నుంచి రవాణా సౌకర్యం పునరుద్ధరించడం తో అండమాన్ నుంచి వైజాగ్ బోట్ లేదా విమానంలో తరలించాలని కోరుతున్నారు. ఇలా వీళ్ళు ఎంతో ఆశగా తిరిగి తమ ఊర్లోకి రావడానికి ఎదురుచూస్తున్నారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments