అయితే ఒక ప్రమాదం నుండి బయటపడ్డాం అంటే ఇప్పుడు నిసర్గ తుఫాను బుధవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారింది. అయితే ఈ తుఫాన్ ఉత్తర మహారాష్ట్ర వైపు గంటకు 12 కిలో మీటర్ల వేగం తో ప్రయాణిస్తోంది.
అలానే ఆలీబాగ్ కి దక్షిణ నైరుతి దిశగా 140 కిలోమీటర్లు ముంబైకి 190 కిలోమీటర్లు సూరత్ కి నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఈ తుఫాను కొనసాగుతోంది.
అయితే ఉత్తర మహారాష్ట్ర దక్షిణ గుజరాత్ కు ఆనుకుని హరిహరేశ్వర్ మధ్య సమీపంలోని తుఫాన్ తీరం దాటనుంది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ తీరం దాటే సమయంలో పెనుగాలులు ఎక్కువవుతాయి.
తీర ప్రాంతాల్లో నివసించే 78931 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ తుఫాన్ గుజరాత్ మహారాష్ట్ర పై తీవ్ర ప్రభావం చోటుచేసుకోగా... ఈ నిసర్గ తుఫాన్ ని తాకిడిని తట్టుకోవడానికి రాష్ట్రం లో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
10 బృందాలు 16 ఎన్డిఆర్ఎఫ్ యూనిట్ల తో తుఫాను సహాయక చర్యల్లో ఉన్నాయని ఆరు బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి ట్విట్టర్లో ప్రకటించారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments