అయితే మొన్నటి వరకు కరోనా బాగా విస్తరించింది. ఢిల్లీ జమాత్ కు వెళ్లిన వారి ద్వారా వైరస్ విస్తరించింది. అయితే ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 85 కేసులు నమోదయ్యాయి ఇందులో 74 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం చెన్నై లోని కోయంబేడు మార్కెట్ కి వెళ్లిన వారి ద్వారా కరోనా బాగా విస్తరిస్తోంది.
ప్రభుత్వం ముందు గానే సమాచారం ద్వారా అప్రమత్తం చేశారు. ఆసియా లో అతి పెద్ద కూరగాయల మార్కెట్ అయిన కోయంబేడు మార్కెట్ తమిళనాడు లోని చెన్నై నగరంలో బస్టాండ్ కి అనుకుని ఉంది.
అయితే చెన్నైకి సమీపంలో ఉన్న ఎనిమిది జిల్లాల తో పాటు చిత్తూరు నెల్లూరు కర్ణాటక కేరళ నుంచి కూడా పెద్ద ఎత్తున కూరగాయలు ఇక్కడ లోడింగ్ అవుతాయి. అయితే లాక్ డౌన్ కారణంగా పెద్ద సంఖ్యలో వ్యాపారాలు జరిగాయి.
ఎక్కువ మంది కమ్ముకోవడం తో ఇక్కడ కరోనా వ్యాపించింది. అయితే ఇప్పటి వరకు తమిళనాడు లో 6009 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక చెన్నైలోనే 3043 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.
అయితే కోయంబేడు మార్కెట్ ద్వారా 600 మందికి పైగా కరోనా సోకింది అన్న వార్తలు వచ్చాయి. చిత్తూరు జిల్లా సరిహద్దు కావడం వల్ల కూరగాయలు లారీలో తీసుకెళ్లడం ద్వారా వైరస్ రావచ్చని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments