ప్రధాని నరేంద్ర మోదీ సామర్ధ్యం తో ప్రపంచానికి ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగారు అని అంటున్నారు రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
అయితే మోదీ రెండోసారి ప్రధాని గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బిజెపి రాష్ట్ర నేతల తో కలిసి విజయవాడ లో విలేకరులతో మాట్లాడారు కన్నా లక్ష్మీనారాయణ.
పారదర్శకమైన పాలన తో వేగవంతమైన అభివృద్ధి బాట లో వేశారని దీని తో పాటు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ.
అయితే ఇప్పుడు ప్రపంచమంతా పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ని కూడా ఆయన నియంత్రిస్తూ ఉండడమే కాకుండా దేశం స్వయంసమృద్ధి తో ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తున్న గొప్ప నాయకుడిగా ప్రజల నుంచి చక్కటి మన్ననలను అందుకున్నారు మోదీ అని చెప్పారు.
అంతే కాకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ. ఇలా ఆయన చెప్తూ ఆదివారం నాడు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఈ విషయం పై చర్చ సాగిస్తే రాష్ట్రానికి ఉన్న గౌరవం పోతుంది అంతే కాకుండా న్యాయ వ్యవస్థ పట్ల రాష్ట్రం లోనే ఉన్న గౌరవాన్ని కూడా కొనసాగించడం ప్రథమమని కన్నా లక్ష్మీనారాయణ తన అభిప్రాయాన్ని తెలియ జేశారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments