తాజాగా విశాఖపట్నం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా పరిధి లో ఆర్ఆర్ వెంకటాపురం లో ఉన్న ఎల్జి పాలిమర్స్ లో కంపెనీ లో గురువారం తెల్లవారుజామున భారీగా రసాయన వాయువు లీక్ అయింది. దీని వల్ల ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. అంతే కాకుండా వెయ్యి మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.
అయితే వేర్వేరు ఆసుపత్రుల్లో ప్రజలు చికిత్స పొందుతున్నారట. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి కొంత అదుపు లోకి వచ్చినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్యాస్ లీకేజ్ జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. అలానే బాధితులని పరామర్శించారు. అంతే కాక సహాయక చర్యలను సమీక్షించారు.
అంతకు ముందే సీఎం జగన్ విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
గ్యాస్ లీకేజ్ కాస్త తగ్గడం తో వెంకటాపురం తో పాటు చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. అక్కడ చిక్కుకున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అయితే దీని వల్ల గంగరాజు అనే స్థానికుడు ప్రాణ భయంతో పరుగులు తీస్తుండగా కళ్ళు సరిగ్గా కనిపించక పోవడంతో నేల బావి లో పడి మృతి చెందాడు. పలు పశువులు కూడా మృతి చెందాయి. ఈ ఘటన తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాలకి చోటు చేసుకుంది. కె జి హెచ్ తో పాటు విశాఖ కేర్ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందుతున్నాయి.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments