అసలు ఆమెను చంపడానికి కారణం ఏంటి ? ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడు ? నిజంగా ఆమె నేరం చేసిందా ? వివరాలు లోకి వెళితే నవతా ట్రాన్స్పోర్ట్ కంపెనీ లో క్లర్క్ గా పని చేస్తున్న సునీల్ రాజ్ మద్యానికి బానిస అయ్యాడు. ఎప్పుడు చూసినా భార్యతో గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ సారి మాత్రం చీర కొంగు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.
ఈ ఘటన విజయవాడ లో జరిగింది. సునీల్ రాజ్ ఇబ్రహీంపట్నంకి చెందినవాడు . అయితే జి.కోడూరు మండలం పినపాకకు చెందిన సౌజన్య తో నాలుగేళ్ళ క్రితం వివాహం జరిగింది. పెళ్ళైన తరువాత పెనములూరు పరిధిలోని కానూరు వినాయక్ నగర్ లో నివాసం వుంటున్నారు.
ఈ నెల పన్నెండున తన పుట్టింటికి తీసుకెళ్లమని భర్తని కోరింది. ఈస్టర్ పండుగని తన పుట్టింటిలో చేసుకోవాలని ఎంతో ఆప్యాయంగా అడిగింది. ససేమీరా వద్దని చెప్పి గొడవకి దిగాడు సునీల్ రాజ్. వీరిద్దరి మధ్య వివాదం జరగడంతో కోపం తో సునీల్ రాజ్ తన భార్యని ఇంట్లోనే చంపేశాడు.
చీర కొంగు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. కానీ హై లెవెల్ లో ఆమె ఉరి వేసుకొని చనిపోయింది అని నమ్మించే ప్రయత్నం చేసాడు. సునీల్ రాజ్ పరార్ అవ్వడం తో రంగంలోకి దిగారు పోలీసులు విచారణ జరిపి భర్తే హత్య చేసాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు అని తెలుస్తోంది.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments