కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనితో రోజు వారి కూలీలకు వెళ్లే వారి పరిస్థితి ఘోరం అనే చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీనితో రోజు కూలీలకు ఎవరు వెళ్లడం కుదరదు కదా. అయితే ఇటువంటి సమస్యల వల్ల ప్రజలకి ఇబ్బందులు రాకూడదని ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.
తెల్ల కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ వెయ్యి చొప్పున ప్రతీ ఇంటికి ఇవ్వనుంది. అది ఈ శనివారం నుండి గ్రామ వాలంటీర్ల ద్వారా అందజేయాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ఇలా నిర్ణయించుకోగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక్కో కుటుంబానికి రూ 1500 ఇవ్వాలని నిర్ణయం తీసుకుందిట.
పింఛన్ ఎలా అయితే అందిస్తారో అదే క్రమంలో ఈ వెయ్యి రూపాయలని కూడా పంపిణి చేస్తున్నారట. గ్రామా, వార్డు వాలంటీర్లు ఇళ్ళకి వచ్చి డబ్బు ఇచ్చి ఆ ఇంటిపెద్ద తో ఫోటోని తీసుకోనున్నారట. ఇలా ఈ విధంగా డబ్బుని పంపిణి చెయ్యాలని ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతే కాకుండా ఒక్కొక్కరికి కూడా 15 కేజీల బియ్యాన్ని పంపిణి చేసింది.
నిత్యావసర వస్తువులని కొనుగోలు చెయ్యడానికి వీలుగా ఉండేలా ఈ డబ్బు పంపిణి చేయనున్నారని చెప్పింది సర్కారు. దీని వల్ల రోజు వారి కూలీలకు, పనులు లేక ఇబ్బంది పడే వారికి కూడా కాస్త ఆర్ధికంగా సహాయం అందించాలని మంచి నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments