అదిరిపోయిన బాబు మాస్టర్ ప్లాన్! వైసీపీ కి పెద్ద దెబ్బ!!

img

కాదేది కరోనాకు అనర్హం...ఇప్పుడు ఈ వాక్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలకు ఫుల్ స్టాప్ పడుతుంది అనుకున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారానికి తెరతీసింది. ఆదివారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం ఉంది. అందుకే నా విచక్షణతో పాటు రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ద్వారా సంక్రమించిన  అధికారాలతో, స్థానిక ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ, గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను మార్చాలని ప్రభుత్వానికి సూచిస్తున్నా “ అని అన్నారు . ఈ నిర్ణయం పై సీఎం.జగన్ మండిపడ్డారు. రమేష్ కుమార్ తీసుకున్నా నిర్ణయం వెనుక రాజకీయ కుట్రవుంది అని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. వాస్తవానికి రమేష్ కుమార్  ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలు, వారు చేసిన వ్యాఖ్యలు “ అనేక సందేహాలకు తావిస్తోంది”. దీని వెనుక బలమైన రాజకీయ కుట్ర ఉందని మేధావులు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుత పరిణామాలు చూస్తూవుంటే జగన్ సర్కార్ “ చంద్రబాబు” ట్రాప్ లో పడినట్టు క్లియర్ గా తెలుస్తుంది. నిజానికి స్థానిక ఎన్నికలు నిర్వహించడం అంటే చంద్రబాబుకు చాలా ఇబ్బంది కరమైన పని. అందుకే ఆ పనికి ఆయన ఎప్పుడూ దిగలేదు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అమాయకంగా ముందు వెనుక ఆలోచించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించి, చంద్రబాబుకు వీలయినంత సాయం చేసింది. మళ్లీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేదు. చంద్రబాబు చేయని పనిని చేయాలని తలకెత్తుకున్నారు. సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటుందో, స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం మాములుగా జరిగే విషయం. చంద్రబాబుకు ఈ విషయం చాల స్పష్టంగా తెలుసు, అందుకే బాబు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ పాన్ లో  వైఎస్సార్సీ అడ్డంగా బుక్ అయ్యింది. చంద్రబాబు నాయుడు ఈ మాస్టర్ ప్లాన్ కోసం ఫోర్ స్టెప్స్ ఫాలో అయ్యారు. 

ఫస్ట్ స్టెప్         : 1) తమ నాయకుల పై దాడి

సెకండ్  స్టెప్ : 2) మీడియాలో అసత్య ప్రచారం

థర్డ్ స్టెప్         : 3) కరోనా వైరస్

ఫోర్త్  స్టెప్       : 4) ఎన్నికల కమిషన్ ను మభ్యపెట్టడం 

మొదటి ప్లాన్ ను టిడిపి చాలా పర్ఫెక్ట్  డీల్ చేసింది. ప్రతి ఎన్నికల్లో పల్నాడు, అనంతపురం, కర్నూలు,  చిత్తూరు వంటి ప్రాంతాలు ఘర్షణ పూరితంగా ఉంటాయి. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తెలుసు. ఇప్పుడు ఆ ప్రాంతాలనే బాబు టార్గెట్ చేసారు. బాబుగారి మీడియా కూడా వాటిమీద గట్టి దృష్టి పెట్టింది. ముందుగా పల్నాడు అనే ప్రాంతానికి టీడీపీ నాయకుడు బోండా ఉమాను పంపించి, ప్రజలను రెచ్చెగొట్టే వ్యాఖ్యలను చేయించింది. దీనితో పల్నాడులో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమయం కోసం వేచిచూస్తున్న ఎల్లో మీడియా ఈ వార్తలను భూతద్దంలో చూపెట్టడం స్టార్ట్ చేసింది. ఇదే తరహాలో అనంతపురం, కర్నూలు చిత్తూరులో గొడవలను సాకుగా చూపించి తమ నాయకుల పై దాడి జరుగుతుంది అని టిడిపి విస్తృత ప్రచారం చేయించింది. పల్నాడు వద్ద జరిగిన గొడవల్లో బోండా ఉమాకు ఎటువంటి గాయాలు జరగలేదు. ఇక్కడ ఎవరికీ అర్ధం కానీ అంశం ఏమిటంటే ? అసలు బోండా ఉమా  పల్నాడుకు చెందిన వ్యక్తి కాదు, కనీసం ఆ ప్రాంత నాయకుడు కూడా కాదు. అటువంటి అప్పుడు ప్రత్యేకంగా పల్నాడుకు, అది కూడా ఎన్నకలు జరుగుతున్న ప్లేస్ కు బోండా ఉమా ఎందుకు వెళ్ళాలి ?. ఎందుకంటే ఇది అంతా బాబు మాస్టర్ ప్లాన్.. 

బాబు ప్లాన్ నెంబర్ టూ : 

కేవలం పల్నాడు, అనంతపురం, కర్నూలు చిత్తూరు ఇలా మూడు నాలుగు ప్రాంతాల్లో జరిగిన గొడవలను ఎల్లో మీడియాలో చూపించి, అసలు ఆంధ్రలో ప్రభుత్వమే లేదనిపించేసారు. మరి కొన్ని పత్రికలు అయితే, ఆంధ్రప్రదేశ్ బీహార్ మాదిరిగా తయారైందని చూపించాయి. చివరకు ఈ విషయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు చేరింది. దీనితో చంద్రబాబు  ప్లాన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. 

ప్లాన్ నెంబర్ త్రి : 

కరోనాతో ప్రపంచ దేశాలన్నీ హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించాయి. అయినప్పటికి భారత్ లో కరోనా ఎఫెక్ట్ అంతగా లేదు. ఇప్పటి వరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ కలిపి కేవలం 2 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 5 కోట్లు మంది ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే కరోనా సోకింది. అది కూడా అతడు ఇటలీ నుండి రావడం వలన. టిడిపి దీనినే అనుకూలంగా మార్చుకుంది. ఇక ఎల్లో మీడియా మరియు పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతుంది అని మీడియా మరియు పత్రికలు ఊదరకొట్టాయి. ఈ వార్తలు ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణం అయ్యాయి.

ప్లాన్ నెంబర్ ఫోర్ : 

ఒక వైపు కరోనా మరో, పక్క స్థానిక ఎన్నికల్లో జరిగిన ఘర్షణలను చూపిస్తూ, ఎన్నికల కమిషన్ ను టిడిపి మభ్యపెట్టింది. పైన పేర్కొన్న అంశాలను పరిచిలించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఆదివారం తెలిపారు. దీనితో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వాయిదా నిర్ణ‌యం ఏపీలో తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యింది. దీనిపై పాల‌క ,ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ర‌స్ప‌స‌రం దూష‌ణ‌ల‌కు దిగుతున్నాయి.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అప్పటి టిడిపి ప్రభుత్వం ఏరికోరి తీసుకువచ్చింది. ఎందుకంటే రమేష్ కుమార్ మరియు నారా చంద్రబాబు నాయుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ అంశాలను పక్కన పెడితే, ఎన్నికల వాయిదా కోసం రమేష్ కుమార్ చెప్తున్న కారణాలు, వారి మాటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రెస్ మీట్ లో 6 వారాలు స్థానిక ఎన్నికలను నిలుపులు దల చేస్తునట్టు ప్రకటిస్తారు. మరో వైపు గుంటూరు, చిత్తూరు కలక్టర్లు, ఎస్పీలు, మాచర్ల సీఐలను తప్పిస్తున్నట్టు చెప్పారు. అసలు ఎన్నికలు వాయిదా వేస్తున్నప్పుడు  కలక్టర్లు, అధికారులను బదిలీ చేసే అధికారం రమేష్ కుమార్ కు ఎక్కడ నుండి వచ్చిందో ఎవరికీ తెలియడం లేదు. ప్రెస్ మీట్ లో రమేష్ కుమార్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో “ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు చెప్తారు. అసలు కరోనా వైరస్ గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైద్య కార్యదర్శితో మాట్లాడకుండా, ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారనే సందేహం రాక తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు చూస్తూవుంటే ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని మేధావులు అంటున్నారు. సీఎం జగన్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఎన్నికలు మాత్రమే కాదు....

వైస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఉగాది పండుగ నాడు పేదలందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. కానీ ప్రస్తుతం 6 వారాలు ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఆ పేదవారికి ఇళ్లపట్టాలు ఎలా అందుతాయి ?. స్థానిక ఎన్నికలు ఈ నెల 31 తో ముగిస్తే,14 ఆర్ధిక సంఘం నుండి దాదాపు 5 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. ఆ నిధులు అందితే రాష్ట్రం అభివృద్ధి జరిగేది. కానీ కొంతమంది స్వార్ధ రాజకీయ శక్తులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. దీనికి వైస్.జగన్ ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి మరి.

మరిన్ని

Comments

0 Comments

ఆంధ్రప్రదేశ్

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()