20 ఏళ్లకే రారాజు ఒకవైపు ఆంధ్ర భోజుడు మరోవైపు కన్నడ రాజ్య రమారమణ శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1530 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. భారతదేశంలోని గొప్ప రాజులలో శ్రీకృష్ణదేవరాయలొకరు. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకునిగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించారు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నతస్థితికి చేరుకుంది. సాహిత్యంలో ఈయన ఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తినందుకున్నాడు. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా సహకారం అందించారు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి అప్పాజీ అని పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయలు 20 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించారు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుపడిన అచ్యుత రాయలు, వీర నరసింహ రాయలు తోపాటు వారి అనుచరులను తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించారు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకుల ఆడపడచు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...