ఫిబ్రవరి 14 అనగానే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులకు, ముఖ్యంగా యువతకు గుర్తొచ్చేది ప్రేమికుల రోజు పండుగే. కానీ 2019 ఫిబ్రవరి 14 న మాత్రం భారతీయులకు ఆ రోజు పీడకలగా గుర్తుండిపోతుంది. కారణం, జమ్ము నుండి శ్రీనగర్ వెళ్ళే జాతీయ రహదారిలో ఒక ఉగ్రవాది, కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడటమే. ఆ ఘోరమైన సంఘటనలో 40 మంది మన భారతీయ సైనికులు మనకు కాకుండా పోయారు. విధి నిర్వహణలో ఉన్న సైనికులు అకస్మాత్తుగా ఆ రాక్షసుడి చర్యకు బలైపోవడం యావత్ భారతావనినీ శోకసంద్రంలో ముంచేయగా, ఎంతో మందికి కోపాన్ని, అవేదనను మిగిల్చింది. ఆ కసి, బాధ ఎంతమంది ఈ ఫిబ్రవరి 14 న గుర్తుచేసుకుంటున్నారు? ఆ బాధని మర్చిపోయి యధావిధిగా ప్రేమికుల రోజు సంబరాల్లో మునిగిపోతున్నారా? అంటే, దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. కానీ చనిపోయిన సైనికుల కుటుంబాలు ఎన్నటికీ మరవలేవు అనేది కఠోర వాస్తవం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...