చాయ్‌వాలా నుంచి ప్రధాని వరకూ మోదీ జీవన్ కీ బాత్ నరేంద్ర మోదీ 1950 సెప్టెంబరు 17న జన్మించారు. మోదీ తండ్రి ఒక చిన్న టీ దుకాణం నడిపేవారు. తల్లి “చిన్న గానుగ” నడుపుతుండేవారు. మోదీ ఆరో ఏట నుండి ఉదయం తండ్రికి సహాయం చేసి, పాఠశాలకు వెళ్ళేవారు. మోదీ తన ఎనిమిదవ ఏట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనగా ఆర్ఎస్ఎస్‌లో చేరారు. ప్రతీరోజూ సాయంత్రం ఆర్ఎస్ఎస్ కి వెళ్ళడం మోదీ దినచర్యగా ఉండేది. 18 ఏళ్ల వయసులో మోదీ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్ళిపోయారు. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చి, అహ్మదాబాద్‌లో తన మామయ్యకు చెందిన టీ దుకాణంలో పనికి కుదిరారు. కొన్ని రోజుల తర్వాత స్వయంగా ఒక టీబండి పెట్టుకుని టీ విక్రయించడం ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచాక మోదీ ఆర్ఎస్ఎస్ఎస్ కార్యాలయంలో చేరారు. 1971 లో ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరానికి వెళ్లారు. ఈ శిక్షణ అనంతరం అతని ప్రతిభను గుర్తించిన ఆర్ఎస్ఎస్ మోదీ కి అఖిల భారత విధ్యార్ధి పరిషత్ గుజరాత్ శాఖ వ్యవహార బాధ్యతలు అప్పగించారు. 1974 లో మోదీ నవనిర్మాన్ ఆందోళనలో పాల్గొన్నారు. 1975లో కేంద్ర పభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆర్ ఎస్ఎస్ నేతలను జైలుకి పంపించిది. ఆ సమయంలో మోదీ పోలీసులకు దొరకకుండా రహస్యంగా కార్యకలాపాలు సాగించారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...