జూన్ 14 2020, ఆదివారం నాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు “సుశాంత్ సింగ్ రాజ్‌పుత్” ఆత్మహత్య చేసుకున్నారు అనే న్యూస్ టీవీ లో ప్రసారం అవుతుంది. మొదట ఆ న్యూస్ చూడగానే మేము దిగ్భ్రాంతి చెందాము. కానీ తరువాత వచ్చిన అనేక న్యూస్ ఐటమ్స్ మాత్రం మమ్మల్ని ఎంతో కలచి వేశాయి . అందులో ముఖ్యంగా మేము విన్న వార్తలు ఇవే: అసలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు ? సుశాంత్‌కి, అతని తండ్రికి విబేధాలు ఉన్నాయా ? సుశాంత్ లవ్ బ్రేక్ అప్ ఏ అతని మరణానికి కారణమా ? ఈ వార్త కధనాలు చూసిన తరువాత మేము సిగ్గుతో తలవంచుకోవలిసి వచ్చింది. ఎందుకంటే ? సుశాంత్ ఆత్మహత్యకు కారణం ఎవరో కాదు, అది మన సమాజం మరియు మన మీడియానే. డబ్బు, అధికారం, కొండంత అభిమాన తారాగణం, అద్బుతమైన నటన సామర్ధ్యం ఉన్న సుశాంత్ ఆత్మహత్య అయినా ఓ సాధారణ వ్యక్తి ఆత్మహత్య అయినా కారణం మన సమాజమే. మనిషి సాంఘిక జీవి.. తనకు కష్టం వస్తే ఈ సమాజం తన చుట్టూ ఉండే స్నేహితులు అండగా వుంటారనే ఓ నమ్మకం, అది కరువైన నాడు మనిషి మానసికంగా, శారీరకంగా క్రుంగిపోయి బలన్మరణానికి పాల్పడతాడు.. దీనినే ఆత్మహత్య అని అంటారు. ఇంత చిన్న విషయం కూడా తెలియని మన మీడియా సంస్థలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను న్యూస్ ఐటమ్ గా మార్చేశాయి.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...