ప్రముఖ కొరియర్ సంస్థ డిటిడిసితో కలిసి కొరియర్ మరియు కార్గో సేవలను అందించడం అనేది ఇప్పుడు మనం చర్చించబోయే స్టార్టప్ ఐడియా... డిటిడిసి వ్యాపారానికి మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది? మేము ఇది వరకు డెలివరి మరియు కొరియర్ స్టార్టప్ లను ఏ విధంగా ప్రారంభించాలనే అంశం పై ప్రత్యేకమైన వీడియోలు చేసాము. మీరు ఇప్పటి వరకు ఆ వీడియోను చూడనట్టు అయితే ఒక్కసారి చూడండి. బెంగుళూరు కేంద్రంగా పనిచేసే DTDC సంస్థ దేశీయ మరియు అంతర్జాతీయ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ సేవలను అందిస్తుంది. DTDC తమ సేవల విస్తరణలో భాగంగా, అర్భన్ , సెమి అర్భన్ మరియు మెట్రో సిటీస్ లో ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేయడానికి సిద్దం అయ్యింది . దీనికి గాను రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో 400 నుండి 500 కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం DTDC దేశంలోని 12,800 పిన్‌కోడ్ స్థానాలకు తపాలా మరియు వస్తువులను పంపిణీ చేస్తోంది. 2022 నాటికి తన సేవలను 18,500 పిన్‌కోడ్ స్థానాలకు విస్తరించాలని కంపెనీ టార్గెట్ పెట్టుకుంది.. ముఖ్యంగా కొరియర్, కార్గో వంటి సేవలను సౌకర్యాలు లేని చిన్న నగరాలు మరియు పల్లెలకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. అయితే DTDC ఈ విస్తరణ ప్రణాళికను పూర్తి చేయాలంటే ఔట్‌లెట్లు అవసరం. అందుకే DTDC నే స్వయంగా అనుబంధ వ్యక్తులతో కలిసి ఫ్రాంచైజీలను ఏర్పాటుకు సుముఖంగా ఉంది.
గమనిక: వ్యాపార అవకాశాలపై చేసే వీడియోలు మాకు లభించిన సమాచారం ఆధారంగా మాత్రమే తయారు చేశాము. మీరు మరిన్ని వివరాలకోసం సంభంధిత శాఖల వద్ద అన్ని వివరాలు తెలుసుకుని అప్పుడు ముందడుగు వేయండి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...