పొగరెక్కిన డ్రాగన్ కంట్రీ మరో సారి భారత్ పై విషాన్ని చిమ్మింది. పైకి నీతి వాక్యాలు చెప్తూనే, భారత్ లో విద్వంసానికి ద్వంద రచన చేసింది. తాజాగా లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలోకి వేల మంది చైనా సైనికులు అక్రమంగా ప్రవేశించి, భారత్ సరిహద్దును ఆక్రమించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తువుంటే డ్రాగన్ యుద్దానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. గాల్వాన్ లోయలో మే మొదటి వారంలో చైనా బలగాలు టెంట్లు వేస్తూ, కొన్ని కిలోమీటర్ల వరకూ భారీ యుద్ధ సామగ్రిని తరలించాయి. ప్రస్తుతం చైనా ఆక్రమిస్తున్న ప్రదేశం, భారత్ లోని భాగమేనని చైనా ఇది వరకే అంగీకరించింది. గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, ప్యాంగాంగ్ లేక్‌లలో చైనా సైన్యం తమ సరిహద్దును దాటి భారత్ లోకి ప్రవేశిస్తూ, మన సైనికులను రెచ్చగోడుతునే ఉంది. జూన్ 15వ తేదీన లద్ధాఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో ఇదే విధంగా ఇరు దేశాలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తరువాత అధికారుల చర్చలతో బోర్డర్ లో ఘర్షణలు తగ్గాయి. అయితే జూన్ 16 సాయంత్రం 06:30 గంటలకు చైనా సైనికులు గాల్వాన్ లోయలోకి చొచ్చుకు వచ్చి, ఒక్కసారిగా భారత్ ఆర్మీ పై దాడి చేశారు. ఆ సమయంలో భారత సైనికులు విశ్రాంతి తీసుకుంటున్నారు . ఎల్ ఓసి వద్ద ఉన్న కర్రలు, రాడ్లు, రాళ్ళతో చైనా సైనికులు మన సైనికులపై దాడికి తెగబట్టారు. దీనితో ఇరు సైనికుల మద్య ౩ గంటలు పాటు ఓ మినీ యుద్దమే జరిగింది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...